అగ్నిధార న్యూస్ ,మంథిని :ముత్తారం పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఏసీపీ*
–శాంతి భద్రతల లో రాజీ లేకుండా పోలీసులు నిరంతరం విధులు నిర్వహిస్తున్నారు.
*ముత్తారం : పెద్దపెల్లి జిల్లా ముత్తారం మండలం లోని పోలీస్ స్టేషన్ ను గోదావరిఖని ఏసిపి గిరి ప్రసాద్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లోని రికార్డులను పరిశీలించి మండలంలోని పరిస్థితులను ఎస్ఐ గారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏసిపి గిరి ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలు పోలీసులకు సహకరిస్తేనే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయని, పోలీసులు ఎప్పుడూ ప్రజల కోసమే, ప్రజా రక్షణ కోసమే నిరంతరం పనిచేస్తున్నారని, పోలీసుల సేవలను నిరంతరం ప్రజలు సద్వినియోగ పరచుకోవాలి అని అన్నారు.
మండలంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని, మండల ప్రజలు ఇలాగే పోలీసులకు సహకరించాలని సంఘవి ద్రోహులకు సహకరించకూడదని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు.
ఆయన వెంట ట్రైనీ ఎస్సై తిరుపతి , హెడ్ కానిస్టేబుల్ రవీందర్ మరియు యు.ఎస్ సిబ్బంది ఉన్నారు
