■  చెరువు మట్టి అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలి*
■  కాంగ్రెస్స్ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ సంతోష్.

■  మట్టి తవ్వకాలలో అధికారుల పాత్రపై సందేహాలు.

■  అనుమతి గోరంత తోడేది కొండంత.

■  ఒకే బిల్లుపైఅనేక టిప్పర్ లకు అనుమతులు?

■  పంచాయతీ కార్యదర్శి పని తీరుపై అనుమానాలు.

■  మైనింగ్ శాఖ అధికారి మాటలు చెబుతున్నాడు.

అగ్నిధారన్యూస్(  పెద్దపల్లి  ) పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలోని చెరువులో పలువురు కాంట్రాక్టర్లు జరుపుతున్న అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకోవాలని తెలంగాణా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ పెర్క సంతోష్ సంబందిత అధికారులను డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేషంలో సంతోష్ మాట్లాడుతూ, పూడికతీత పేరున అనుమతులు పొందిన కాంట్రాక్టర్లు నిబందనలు విరుద్దంగా మట్టిని అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ, ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారని తెలిపారు. వే బిల్లులు చెల్లించకుండా కేవలం ఒక బిల్లుతో అనేక టిప్పర్ల మట్టిని తరలిస్తున్నారని వివరించారు. కేవలం ఒక మీటరు తవ్వకానికి అనుమతి పొంది, అంతకన్న ఎక్కువ లోతు వరకు మట్టిని దోచుకుంటున్నారని పేర్కొన్నారు. రాత్రి వేళల్లో పెద్ద ఎత్తున టిప్పర్లు మట్టితో తరలిపోతున్నా, సంబందిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికి నిర్లక్ష్యంగా వ్య్వహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల పాత్రపై సైతం ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. బాద్యులపై చర్యలు తీసుకొని, మట్టిని తరలిస్తున్న వాహనాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశలో లో కనుకుంట్ల సదానందం,   పెర్క శివ,  పెర్క సురేష్,  సదిరం రాజు,తదితరులు పాల్గొన్నారు.