గౌరెడ్డి పేట గ్రామంలో పోలీస్ మీకోసం కార్యక్రమం

ప్రజలకు భరోసానిస్తూ చైతన్య పరిచిన పెద్దపల్లి ఎస్ఐ రాజేష్

*అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి ) రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌరెడ్డి పేట గ్రామంలో శనివారం సాయంత్రం రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్(ఐజీ) మరియు పెద్దపల్లి ఇన్చార్జి డి సి పి అఖిల్ మహాజన్ ఐపీఎస్*   ఆదేశాల మేరకు…. . .

*పెద్దపల్లి ఎస్ ఐ రాజేష్ ఆధ్వర్యంలో* కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా పోలీసు మీకోసం కార్యక్రమo నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన … గ్రామంలో ఉన్న సమస్యల పరిస్థితులపై ప్రజలతో మాట్లాడారు…..
గుడుంబా,గుట్కా,గంజాయి లాంటి అక్రమ వ్యాపారం, చట్ట వ్యతిరేకమైన కార్యాకలాపాలకు దూరంగా ఉండాలి అన్నారు. యువత చెడు అలవాట్లకు బానిసగా మారి జీవితం నాశనం చేసుకోవద్దు అని సూచించారు. *ప్రభుత్వం నుండి వెలువడిన ఉద్యోగ ప్రకటనలో * ప్రభుత్వ, పోలీసు ఉద్యోగాలు సాధించడానికి పట్టుదలతో  కృషి చేయాలని అన్నారు, చట్ట వ్యతిరేకమైన పనులు చేసి కేసులు నమోదు ఐతే ఎలాంటి ఉద్యోగ అవకాశాలు రాక ఇబ్బంది పడవలసి ఉంటుందని హెచ్చరించారు.

*వాహనాలు నడిపేటప్పుడు*

తప్పకుండా హెల్మెట్ ధరించాలి అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ అందరు కలిగి ఉండాలని తెలిపారు.వాహనాలకు సంబందించిన అని ధ్రువపత్రాలు రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ కలిగి ఉండాలని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఉండి ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో ఇన్సూరెన్స్ వర్తించదు అన్నారు ఇన్సూరెన్స్ గడువు ముగియాక ముందే దానిని రినివల్ చేపించుకోవాలని సూచించారు.
*మహిళల భద్రతే పోలీస్ లక్ష్యం *

మహిళల, యువతుల, చిన్నపిల్లల తో మర్యాదగా ప్రవర్తించాలి. వారిని గౌరవించాలి అన్నారు. మన కుటుంబ సభ్యులతో ఎంత మర్యాదగా ఉంటామో బయట వారితో కూడా అలాగే మెదలాలి అన్నారు.మహిళ పట్ల, చిన్న పిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన, వారిని మానసిక, శారీరకంగా హింసించిన వారిపట్ల చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం కేసులు నమోదు చేయడం జరుగుతుంది అని హెచ్చరించారు.

*ప్రజలు,మహిళలు ఆపద సమయంలో*

స్థానిక పోలీసులకు లేదా డయల్ 100 కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే పలు రకాల పుకార్లను నమ్మకూడదని, వాటిలో నిజానిజాలను స్థానిక పోలీసులను అడిగి తెలుసుకోవాలి అని సూచించారు.

*గ్రామాలలో మరింత స్వీయ రక్షణ కొరకు*

సీసీ కెమెరాలను అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని, భద్రతా పరమైన అంశాల లో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
మీ గ్రామంలో ఎవరైనా కొత్తవారు అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే వెంటనే  పోలీస్ లేదా డయల్ 100 కు ఫోన్ చేసిన  వెంటనే చర్యలు చేపడతామన్నారు. పై విధానాల వల్ల నేరాల రేటు తగ్గుతాయని ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని తెలిపారు.

సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి.

తెలియని ఫోన్ కాల్స్ వచ్చిన మెసేజ్ లు వచ్చినా వెంటనే వాటికి సమాధానమిస్తూ ఓటిపి లను పిన్ నెంబర్ లను చెప్పకూడదు అన్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన ట్లయితే వెంటనే 1930 లేదా డయాల్ 100 కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శ్రీనివాస్ నాయకులు బండారు శ్రీనివాస్ వి పి ఓ, హెడ్ కానిస్టేబుల్ శంకర్, , పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు,  పాల్గొన్నారు.