కిడ్నాప్ కాబడిన బాలుడున్ని కాపాడి తల్లితండ్రులకు అప్పగించిన మంచిర్యాల పోలీసులు.

అగ్నిధారన్యూస్( రామగుండంకమిషనరేట్ ) రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జిల్లా మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని జాఫర్ నగర్ కు చెందిన 21 నెలల బాబు కిడ్నాప్ కావడం ఒక్కసారి కలకలం సృష్టించింది.బావురి చాందిని అనే మహిళా తన నా కొడుకు బావురి షాజస్ కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతకగా ఎక్కడా ఆచూకీ కనిపించలేదు. తెల్లవారు జామున సంగు అను వ్యక్తి ఆ ప్రాంతంలో తత్సరడం చూసి అనుమానంతో…… మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ లో 02-06-2022 రోజున పిర్యాదు చేయగా పిర్యాదు ఆధారంగా  ఎస్ఐ తాజుద్దీన్  కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది. మంచిర్యాల ఇన్చార్జి డీసీపీ అఖిల్ మహాజన్ , ఏసీపీ  ఆధ్వర్యంలో చిన్న బాబు కోసం ప్రత్యేకంగా టీమ్ లను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టగా నమ్మదగిన సమాచారం మేరకు మంచిర్యాల ఓవర్ బ్రిడ్జి దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక ఆటోలో అనుమానాస్పదంగా చిన్న పాపతో కొంత మంది వ్యక్తులు పోలీసు వారిని చూసి పారిపోవాలని ప్రయత్నిస్తుoడగా ఆటోని పట్టుకొని అందులో ఉన్న వారిని విచారించగా వారి దగ్గర ఉన్న బాబు జాఫర్ నగర్ లో కిడ్నాప్ చేయబడిన బాబు అని ఒప్పుకోవడం జరిగింది. వెంటనే నిందితులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది.

*నిందితుల వివరాలు*

1.కిచ్చ సంగు s/o బీర్బల్,36yrs, బొందిల్, జాఫర్ నగర్ మంచిర్యాల

2. వంకడోత్ నరేష్ s/o కిషన్,36yrs, లంబాడి రాజీవ్ నగర్, మంచిర్యాల

3. వొర్సు కొమురయ్య s/o రాములు,52, yrs, వడ్డెర, అభినయ కాలనీ, నస్పూర్

4. వొర్సు విజయ w/o కొమురయ్య ),45 yrs, వడ్డెర, అభినయ కాలనీ, నస్పూర్

5.వొర్సు సంపత్ s/o కొమురయ్య ,32, yrs, వడ్డెర, అభినయ కాలనీ, నస్పూర్

*స్వాధీనపరుచుకున్న వాటి వివరాలు*

ఆటో AP01Y7040

*వివరాల్లోకి వెళితే……*

సంగ S/O బీర్బల్, వయస్సు: 36 సం,,లు, కులం: బొందిల్, నివాసం: జాఫర్ నగర్, మంచిర్యాల. వ్యక్తి రైల్వే స్టేషన్ ఏరియా లో కట్టే వస్తువులైన కోలలు, పీటలు, పప్పు గుర్తులు, ఆట బొమ్మలు అమ్ముకుంటూ జీవిస్తున్నాడు. అతనికి పెళ్ళి కాగా ఒక కొడుకు వయస్సు 5సం,,లు, ఒక పాప వయస్సు: 1 సం.. ఉన్నారు . సంగు గత సం,,లో గంజాయి అమ్ముతూ మంచిర్యాల పోలీసు లకు దొరికి జైలు కి వెళ్ళి వచ్చినాడు . తర్వాత నిందితుడు ఆటో కొనుక్కొని ఆటో నడుపుతుండగా ఈ మధ్య నస్పూర్ ఏరియా లో ఆటొ కి ఆక్సిడెంట్ అయ్యి బాగా డ్యామేజ్ అవడంతో కుటుంబ పోషణకు, జల్పాలకు డబ్బులు సరిపోక పోవడం తో ఏ విధంగానైనా సులువుగా డబ్బులు సంపాదించాలని అనుకొని సంగు గతంలో తనకు పుట్టిన పాప ని హైదరాబాద్ లో వాళ్ళ దూరపు బందువులకు అమ్మగా 1,50,000/- రూపాయలు ఇచ్చినారు. మళ్ళీ అదే విధంగా సంగు నివాసం ఉండే జాఫర్ నగర్ లో తన ఇంటి దగ్గర ఎవరినైనా పాప/బాబు ని కిడ్నాప్ చేసి అమ్మి డబ్బులు పొందాలని, పథకం వేసి అట్టి విషయాన్ని స్నేహితుడు నరేశ్ మరియు అత్త, మామ , బావమరిది లకు చెప్పగా వారు కూడా నాకు సహకరిస్తారని చెప్పినారు. తన ఇంటి దగ్గర ఉండే చాందిని యొక్క భర్త ఇక్కడ ఉండకపోవడంతో చాందిని యొక్క సుమారు 2 సం,, ల వయస్సు ఉన్న బాబు ని సులువుగా కిడ్నాప్ చేయవచ్చని అందరు కలిసి ఒక పథకం ప్రకారంగా  బాబు ని కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకొని తన స్నేహితుడు నరేశ్, మా అత్త మామ లకి ఫోన్ చేసి తెలిపి, సమయం కోసం చూస్తుండగా  తేదీ 01/06/2022 న రాత్రి భోజనం చేసి చాందిని తన ఇద్దరు పిల్లలతో ఇంటి బయట పడుకోగ సంగు,నరేశ్ కి ఇట్టి విషయం చెప్పగా అతడు తన తండ్రి యొక్క ఆటో. B.No. AP01 Y7040ని తేది 02/06/2022 న తెల్లవారుజామున 3 గం. లకు సంగు ఇంటి రాగ సంగు నెమ్మదిగా చాందిని యొక్క చిన్న కొడుకు బావురి పాజన్ ని ఎత్తుకొని బాబు ని ఆటోలో తీసుకోని బస్ స్టాండ్ నుండి రైల్వే స్టేషన్ మీదుగా తన అత్తగారింటికి తీసుకెళ్లినారు, కొద్ది సేపటి తర్వాత బాబు ని ఎక్కడికైనా తీసుకెళ్లి ఎవరికైనా అమ్ముదామని అందరు నిర్ణహించుకొని నరేశ్ యొక్క ఆటొ లో మంచిర్యాల వైపు వస్తుండగా ఓవర్ బ్రిడ్జ్ దగ్గర పోలీసు వారు వాహనాలు తనిఖీ చేయడాన్ని చూసి మేము పారిపోవాలని చూడగా పోలీసు వారు పట్టుకోవడం జరిగింది.

కిడ్నాప్ కాబడిన 21 నెలల బాబుని కాపాడడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ అధికారులను సిబ్బందిని మంచిర్యాల ఇంచార్జి డీసీపీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ అభినందించారు.