అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లిజిల్లా )మానేరు నది పరివాహక ప్రాంతాల ప్రజల సహజ వనరు అయిన ఇసుక ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలి వెళ్తుందని అరికట్టాల్సిన అధికారులు పట్టించుకోవడంలేదని, ఓదెల మండల జడ్పిటిసి గంట రాములు యాదవ్ జడ్పీ సర్వసభ్య సమావేశంలో సంబంధిత శాఖ అధికారులపై తీవ్రంగా మండిపడ్డారు.అనుమతులకు మించి ఇసుక తవ్వడం ద్వారా భూగర్భ జలాలు దెబ్బతినే అవకాశం ఉందని ఆరోపించారు. ప్లే కార్డు చూపుతూ తెలిపారు. మానేరు పై నిర్మించిన చెక్ డ్యాములు ఎక్కడికక్కడ కూలి పోతున్నాయని ధ్వజ మెత్తారు .పరిమితికి మించి ఇసుకను లారీలలో తరలించడం ద్వారా రోడ్లు ధ్వంసం అవుతున్నాయని ఆరోపించారు.ఇప్పటికైనా అక్రమ ఇసుక నియంత్రపైన చర్యలు చేపట్టినట్టు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పుట్ట మధుకర్ కల్పించుకోవడంతో సమస్య సర్దుమణిగింది.

