అగ్నిధారన్యూస్ ( సంగారెడ్డిజిల్లా ) ఇంటర్ ఫలితాల్లో జోగిపేట పట్టణంలో SRM జూనియర్ కళాశాల ప్రభంజనం ఈసారి కూడా కొనసాగడం జరిగింది.వివరాల్లోకి వెళితే MPC గ్రూప్ మొదటి సంవత్సరంలో పి. పూజ జోగిపేట పట్టణంలో మొదటి ర్యాంకు , తెలంగాణ స్టేట్ లో నాలుగో ర్యాంకును సాధించడం జరిగింది. మార్కుల వివరాలను చూస్తే మొదటి సంవత్సరంలో R.పూజ MPC 460/470,P.శ్రావణి MPC 460/470,B.నిమిత CEC 481/500, CH.దుర్గ BIPC 429/440,రెండవ సంవత్సరంలో K.సుస్మిత BIPC 966/1000, G.ప్రియాంక MPC 923/1000,N.అన్నపూర్ణ CEC 924/1000 దాదాపుగా టాప్ పదిహేను ర్యాంకులను SRM జూనియర్ కళాశాల విద్యార్థులు కైవసం చేసుకోవడం జరిగింది.ఈ మార్కుల ఆనందంతో కళాశాల విద్యార్థినీ విద్యార్థులు ,కళాశాల ప్రిన్సిపల్ నర్సింహారెడ్డి ,కరస్పాండెన్స్ చంద్రశేఖర్  కళాశాలల్లో పనిచేసే లెక్చరర్లందరూ బ్యానర్లతో జోగిపేట పట్టణంలో ర్యాలీగా వెళ్లి బాణాసంచాలు స్వీట్లను పంచి సంబరాలు జరుపుకున్నారు.