■   కార్యాలయంలో పొంచి ఉన్న ప్రమాదం.

■  పట్టించుకోని అధికారులు.

■  ఆందోళనలో ఉద్యోగులు ప్రజలు.

■  కంప్యూటర్లపై కవర్లు కప్పిన వైనం.

■  వెంటనే ఉన్నత అధికారులు స్పందించి మరమ్మత్తులు చేపట్టాలని డిమాండ్.

­అగ్నిధారన్యూస్ (భీమారం)చూడడానికి బయట అందంగా ఉన్న కార్యాలయం లోపలికి అడుగుపెట్టే వారంతా అబ్బో అని ఆశ్చర్యపోతారు. వర్షం వస్తే గాని తెలియలేదు. ఇంతకీ ఈ సీన్ ఎక్కడంటే మంచిర్యాల జిల్లా లోని భీమారం మండల తహసిల్దార్ కార్యాలయం లో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జరిగిన సందర్భం. శిథిలావస్థకు చేరిన కార్యాలయం ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని భయపడుతున్న సిబ్బంది. కనీసం లోపల కూర్చోవడానికి కూడా స్థలము లేని విధంగా తడిసి ముద్దయిపోయిన కార్యాలయం. కంప్యూటర్లు టేబుల్స్ కుర్చీలు ఇలా ఒక్కటేమిటి అన్ని తడిసి ముద్దయి పోయాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు  స్పందించి కార్యాలయం మరమ్మత్తులను చేపట్టలని ప్రజలు కోరుతున్నారు.