…………………………………………………………………………………………………………………….

అగ్నిధారన్యూస్( గోదావరిఖని ) పెద్దపల్లి జిల్లా  సామాజిక మాధ్యమాలలో చెక్కర్లు కొడుతున్న ఆర్టీసీ బస్సుల మరలింపు అనేది  అవాస్తవం అని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఆర్టీసీ డిపో మేనేజర్ మల్లేశం ఒక ప్రకటనలో తెలిపారు.ఎవరో ఆకతాయిలు వాట్సాప్ లో పోస్ట్ చేసిన మెసేజ్ వల్ల జిల్లాలోని ప్రయాణికులు అయోమయానికి గురవుతున్నారన్నారు. గోదావరిఖని నుండి హైదరాబాద్ వరకు రోడ్డు రవాణా వ్యవస్థకు వర్షాల వల్ల ఏ లాంటి ఆటంకం కలగలేదన్నారు. అదేవిధంగా ఆర్టీసీ బస్సులు  గోదావరిఖని నుండి హైదరాబాద్ వరకు అన్ని బస్సులు నడుస్తున్నాయని ఆ ప్రకటనలో తెలిపారు.