అగ్నిధారన్యూస్ (పెద్దపల్లిటౌన్ ) ప్రపంచం శర వేగంగా అభివృద్ధి చెందడానికి రవాణా వ్యవస్థ ఎంత ముఖ్యమో మనకు తెలిసిందే రకరకాల రవాణ మార్గాలలో ప్రజలు ప్రయాణిస్తుంటారు గమ్యాన్ని చేరుకొని అవసరాలు తీర్చుకుంటారు. ధనిక ,మధ్యతరగతి, పేద ప్రజానీకం అనే తేడా లేకుండా అందరూ ఎక్కువగా రోడ్డు రవాణా వ్యవస్థ పై ఆధారపడి జీవిస్తుంటారు. దానికి అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పల్లె పట్టణం అనే తేడా లేకుండా కమ్యూనికేషన్ వ్యవస్థను ( రోడ్డు రవాణా వ్యవస్థ ) ప్రజలకు అనుసంధానం చేస్తున్నాయి. ప్రజలు వారు వెళ్లే మార్గంలో ఎక్కడ ప్రయాణానికి అంతరాయం కలగకుండా. రోడ్డు ప్రమాద రహదారి భద్రత రహదారి మార్గాల సూచికలు అవసరమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేసి ప్రజల ప్రయాణానికి ఎలాంటి అంతరాయం కలగకుండా ఆర్ అండ్ బి అధికారులు చర్యలు చేపట్టాలి.
కనిపించని మార్గ సూచిక
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని చీకురాయి రోడ్డు వద్ద గల రవాణా మార్గ సూచిక సంవత్సర కాలంగా కింద పడిపోయి మట్టిలో కోరుకుపోతున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు అటువైపుగా ( చీకురాయి, భోజన్నపేట,మూలసాల,) పేర్లతో చెక్కబడ్డ రవాణా సూచిక బోర్డు కిందపడి కనిపించకపోవడంచేత, కొత్తగా ప్రయాణించే ఇతర ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారి మార్గo సూచిక బోర్డు….కనబడనందున కొన్ని సందర్భాలలో చీకురాయి దారి అనుకొని పెద్దబొంకూర్ వరకు వెళ్లొచ్చిన ప్రయాణికులు కూడా ఉన్నారు. ముఖ్యంగా రంగంపల్లి వద్దగల బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్ ,లో చదివే ఇతర ప్రాంతాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు దారి తెలియక ఇబ్బంది పడిన సందర్భాలు అనేకం, అదేవిధంగా నిత్యం పెద్దపల్లి కేంద్రం నుండి రంగంపల్లి ,చీకురాయి, భోజన్నపేట, మూలసాల, అంకంపల్లి ,కొలనూరు… కాల్వ శ్రీరాంపూర్, ఓదెల ,సుల్తానాబాద్ ,మండలాలకు వెళ్లే వందలాది మంది ప్రజలు నిత్యం ఈరహదారి వెంట వెళుతుంటారు. కాబట్టి ఇప్పటికైనా సంబంధిత ఆర్ అండ్ బి శాఖ ఉన్నతాధికారులు స్పందించి అవసరమైన ప్రాంతాలలో చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

