అగ్నిధారన్యూస్( కమాన్ పూర్ ) పెద్దపల్లి కమాన్ పూర్ మండలకేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ఆదివరహా స్వామి జయంత్యుత్సవాలు ఈనెల ఎనిమిదో తేదీ నుండి పదవ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని ఆలయ ఈవో కాంత రెడ్డి తెలిపారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్-స్నేహాలత దంపతులతో కలిసి మంగళవారం రోజు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించా రు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత , పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్-శైలజ దంపతులు, గ్రంధాలయ ఛైర్మన్ రఘువీర్ సింగ్ , నాయకులు జక్కు రాకేష్ , కమాన్ పూర్ వైస్ ఎంపిపీ ఉప్పరి శ్రీనివాస్ తదితరులు అర్చకులు కలకుంట్ల వరప్రసాదాచార్యులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
