అగ్నిధార న్యూస్ రామగుండం )పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం బాదితుడు ముంజ హరీష్ కమాన్ పూర్ వద్ద బావిలో దూకి బలవన్మరణo చెందాడు. హరీష్ ఆర్ ఎఫ్ సి ఎల్ లో ఉద్యోగం కోసం లక్షల రూపాయలు దళారులకు డబ్బులు ముట్ట చెప్పి ఇబ్బంది పడ్డాడని, తన చావుతోనైనా బాదితులకు న్యాయం జరగాలంటు, గత రెండు రోజులుగా సోషల్ మీడియా లో ప్రచారం వైరల్ గా మారింది. చివరకు శనివారం హరీష్ మృతితో కుటుంబాలలో విషాదం నెలకొంది. నాకు వచ్చే డబ్బులు తన కుటుంబానికి ఇవ్వాలని వేడుకోవడం సంచలనం రేకెత్తిస్తుంది. మృతుడు హరీష్ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం అంబాలపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి. హరీష్ మృతితో ఆర్ ఎఫ్ సిఎల్ ఉద్యోగ బాధితులు, కార్మికులు ఆవేదనకు లోనయ్యారు. కమాన్ పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
