అగ్నిధారన్యూస్ నస్పూర్:తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షురాలు కవిత పై అసత్య ఆరోపణలు చేసిన సందర్భంగా బిజెపి ప్రభుత్వ దిష్టిబొమ్మను శ్రీరాంపూర్ ఏరియా షిర్కె చౌరస్తాలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఏరియా అధ్యక్షులు కె. సురేందర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు డీ. అన్నయ్య, చర్చల ప్రతినిధి ఏనుగు రవీందర్ రెడ్డి, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, మరియు ఫిట్ సెక్రెటరీ వెంకన్న, మామిడి మహేందర్ రెడ్డి, గోపాల్, రాయమల్లు, సత్యనారాయణ, కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
