అగ్నిధారన్యూస్(  పెద్దపల్లి ) శనివారం రోజు పెద్దపల్లి జిల్లా కేంద్రం భారత నాస్తిక సమాజం,ప్రజా సంఘాల నాయకులు బాలసాని లెనిన్ మోదుపల్లి శ్రవణ్ మాట్లాడుతూ భారతదేశంలో రాజకీయాల్లో రోజురోజుకీ మతాన్ని జోడించి ప్రజలను ఆజ్ఞనం వైపు నడుపుతూ పశ్నించే గొంతులను నోక్కే స్తున్నారు అన్నారు. అమాయక ప్రజలలో ఉన్న నమ్మకాన్ని ఆసరా చేసుకుని ప్రజలను మోసం  చేస్తున్నారు అన్నారు. ప్రభుత్వాలు కూడా ప్రజలను శాస్త్రీయ దృక్పథం వైపు నడపాలని ఆర్టికల్ 51 జోడిస్తున్న ప్రజా ప్రతినిధులు మతాలకు అనుగుణంగా మారుతున్నారు అన్నారు. ఇలాగే కొనసాగితే భవిష్యత్ భారత దేశముమూఢ నమ్మకాల వైపు అంధకారంలోకి వెళ్తుంది అని ఆవేధన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో కులం ఆధారంగా జరిగే అనేక సంఘటనలు జరుగుతున్నాయని మతం ఆధారంగా రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యన్ని ధ్వంసం చేస్తున్నారని అన్నారు. అలాగే పెద్దపెల్లి జిల్లాలో ప్రశ్నించే వారిని మనోభావాల పేరుతో క్రమశిక్షణతో జీవించే సామాన్య వ్యక్తులను ఇబ్బంది పెడుతున్నారని అలాంటి స్వభావాన్ని మానుకోవాలని అన్నారు.  అభ్యుదయవాదులు, చదువుకున్నవాళ్లు ,మేధావులు ,కులాలకు ,మతాలకు, వ్యతిరేకంగా ఉండాలని అన్నారు.  సమాజంలో అలజడులు అల్లర్లు సృష్టించే విధంగా ప్రయత్నించే కొంతమంది ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని  కోరారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన  భారత దేశంలో శాంతి భద్రతలు నేపథ్యంలో వాటిని అదుపులో ఉంచేందుకు పోలీసు  అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందులో   ఈదునూరి ప్రేమ్ పురేళ్ల అజయ్ కనుకుంట్ల సుమన్ తిర్రి వంశీ గజ్జెల్లి ఆదర్స్ తదితరులు పాల్గొన్నారు.