నిబంధనలు అతిక్రమిస్తే జరిమానాలతో పాటు జైలు శిక్ష.
రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్.
అగ్నిధారా న్యూస్ ,(రామగుండం) మద్యం తాగి వాహనాలు నడపరాదని అతిక్రమిస్తే చర్యలు తప్పవని
రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, అన్నారు. టాపిక్ ఎస్సైలు కమలాకర్, నాగరాజు, రాజేందర్ లు తమ సిబ్బంది తో కలసి గత కొంతకాలంగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన 37 మంది ముందుబాబు లను సెకండ్ అడిషనల్ మేజిస్ట్రేట్ గణేష్ ముందు హాజరుపరచగా 30 మందికి 1000 రూపాయల చొప్పున, మద్యం సేవించి కారు నడిపిన వ్యక్తి కి 2000 రూపాయలు జరిమానా విధించడం జరిగిందని అధికంగా మద్యం సేవించి వాహనం నడిపిన 6గురు మందుబాబులకు జరిమానా తో పాటుగా జైలు శిక్ష ఇదించడం జరిగిందని తెలిపారు. జరిమానా విధించిన మొత్తం 44,000 రూపాయలు..జైలు శిక్ష పడిన వారి వివరాలు. వెల్లడించారు.ఫులచన్ సబర్ తండ్రి పేరు దబాలే సబర్ 1 రోజు జైలు శిక్ష 2000 వేల రూపాయల జరిమానా,
బైరీ శ్రీధర్ తండ్రి పేరు నారాయణ2 రోజుల జైలు శిక్ష రెండు వేల రూపాయల జరిమాన,గాజుల శంకర్ తండ్రి పేరు గట్టయ్య 2 రోజుల జైలు శిక్ష రెండు వేల రూపాయల జరిమానా,ఎరుకల క్రిష్ణ తండ్రి పేరు రాయమల్లు,ఒక రోజు జైలు శిక్ష రెండు వేల రూపాయల జరిమానా, బొండకుంటి ప్రభాకర్ తండ్రి పేరు మల్లయ్య,రోజుల జైలు శిక్ష రెండు వేల రూపాయల జరిమానా,గద్దల నవీన్ కుమార్ తండ్రి పేరు చంద్రయ్య,5 రోజుల జైలు శిక్ష రెండు వేల రూపాయల జరిమానా విధించారు.ప్రమాదాల నివారణ కొరకు ప్రతి రోజు డ్రంక్ డ్రైవ్ లు నిర్వహిస్తామని వాహనదారులు ఎవరూ కూడా మధ్యం సేవించి వాహనం నడపకూడదని మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేసి జైలు కు పంపిస్తామని వారి డ్రైవింగ్ లైసెన్సు లు రద్దు కోసం సంబంధిత అధికారులకు సిఫారసు చేస్తామని ఆయన తెలిపారు.
