రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర నాయకుడు వాగ్మారే అభిషేక్ డిమాండ్

అగ్నిధారన్యూస్ కొమురంభీమ్ (అసిఫాబాద్)ఏజెన్సీ ప్రాంతంలో దళితులు తరతరాలుగా నివసిస్తున్న గాని రాజ్యాంగం అందించిన రిజర్వేషన్ మాత్రం అందని ద్రాక్షగానే ఉందని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర నాయకుడు వాగ్మారే అభిషేక్,అన్నారు.ఎన్నో ఏళ్ల నుండి ఇక్కడే దూర్బరమైన పరిస్థితిలో బతికీడుస్తున్న ఎన్ని ప్రభుత్వాలు వచ్చిన గాని దళితుల బతుకులు మాత్రం మారడం లేదు. ప్రభుత్వ పథకాలు ఎన్ని వచ్చిన  ఏజెన్సీ లోని దళితుల పరిస్థితి మారలేదన్నారు. తెలంగాణ వస్తే కొంత ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న దళితుల బతుకులు మారుతాయి అనుకుంటే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉంది తప్ప ఏజెన్సీ  దళితులకు ఓరిగిందేమి లేదు తెలంగాణ రాష్ట్ర  ముఖ్యమంత్రి  దళితుల మేలుకోరి దళిత బంధు పథకాన్ని పెట్టినప్పుడు చాలా సంతోషంగా ఉండే కానీ అదే ఒక నియోజకవర్గానికి 500 యూనిట్లు అనే సరికి కొంత ఆందోళనకు గురి కావల్సి వస్తుందన్నారు.  ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న అన్ని దళిత కుటుంబాలకు అందరికీ దళిత బంధు పథకం అందేటట్టు చూడాలని తెలంగాణ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.