అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ) పెద్దపల్లి డి పి ఆర్ ఓ గా నూతన బాధ్యతలు స్వీకరించిన మహమ్మద్ ఆయుబ్ ఖాన్ ను తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) నాయకులు సోమవారం రోజున మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డిపిఆర్ఓ ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) జిల్లా అధ్యక్షులు పోగుల విజయకుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి సుంక మహేష్, జాతీయ కార్యవర్గ సభ్యులు రంగు రాజయ్య ,కమిటీ సభ్యులు బందెల రాజశేఖర్, కార్యవర్గ సభ్యులు కల్లెపల్లి దేవెందర్,చొప్పరి సుమన్,బాలరాజు లతోపాటు పలువురు పాల్గొన్నారు.
