■ రేషన్ డీలర్లు, వ్యాపారుల కుమ్మక్కు
అక్రమ రేషన్ బియ్యాన్ని మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలకు తరలింపు.
■ వేకువజాము నుంచే దందా కొనసాగింపు.
■ జిల్లాలో దాడులు జరిగినా తీరు మారని వైనం.
■ అధికారుల అండదండలతోనే అక్రమ బియ్యం దందా
అగ్నిధారన్యూస్( పెద్దపల్లిజిల్లా) దేశంలో దారిద్య్రరేఖ కు దిగువన ఉన్న పేద మధ్యతరగతి ప్రజలందరికీ సబ్సిడీపైకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ దుకాణాల ద్వారా బియ్యం సరఫరా చేస్తోంది. ఆకలితో అలమటించకూడదని సత్సంకల్పంతో చేపట్టిన కార్యక్రమం అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారి సబ్సిడీ బియ్యాన్ని ప్రతి నెల గద్ద లాగా తన్నుకు పోతున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అక్రమ బియ్యం దందా జోరుగా జరుగుతున్నప్పటికీ పెద్దపల్లిజిల్లాలో మాత్రం అడ్డు అదుపు లేకుండా కొనసాగుతుంది. కరోనా మొదటి దశకు ముందు రైలు మార్గం ద్వారా కాజిపేట్ నుండి బల్లార్షా వరకు వెళ్లే నాగపూర్ ప్యాసింజర్ లో బియ్యం దందా జోరుగా జరిగింది. రైల్వే స్టేషన్ కి సమీప గ్రామాలు ఉప్పల్, జమ్మికుంట, పొత్కపల్లి ,ఓదెల, కొలనూర్ ,కొత్తపల్లి, పెద్దపల్లి, రాఘవపురం , పెద్దంపేట్ మొదలైన రైల్వే స్టేషన్లు అక్రమాకులకు అడ్డగా ఉండేవి. అర్ధరాత్రి వేళ ఆ రైల్లో అంతగా నిఘా వ్యవస్థ లేకపోవడం చేత ఆడిందే ఆటగా పాడిందే పాటగా ప్రతినెల కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని బియ్యం దొంగలు కొల్లగొట్టారు. దేశంలో కరోన విజృంభించిన దృష్ట్యా ప్యాసింజర్ రైలు రద్దయినందున బియ్యం దొంగలు తమ పంతాను మార్చి ట్రాక్టర్ ,డిసిఎం, టాటా, ఏసీ, లారీల, ద్వారా రోడ్డు మార్గంలో అధికారులను ప్రసన్నం చేసుకొని వారి అండదండలతో. దంద నేటికీ కొనసాగుతుంది . ఈ విషయమై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ వ్యాపారులు కోట్లాది రూపాయల విలువ చేసే బియ్యం రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అప్పుడప్పుడు రహదారి వెంట పోలీస్ తనిఖీలలో బియ్యం దొంగలు దొరికినప్పటికీ అక్రమార్కుల తీరులో మార్పు లేదు. గ్రామాలు పట్టణాలు అక్రమ దందాకు కేంద్రాలుగా మారి ప్రతిరోజు వెయ్యిల క్వింటాళ్ల బియ్యం మహారాష్ట్రకి కర్ణాటక చతిస్గడ్ రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఊరురాపగటి దొంగలు బియ్యం అక్రమ వ్యాపారంలో ఉన్న లాభాన్ని రుచి మరిగిన అక్రమార్కులు రెచ్చిపో యి ఊరుకొకడు పుట్టుకొచ్చి రేషన్ సరుకులను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ రెండు చేతులా సం పాదిస్తున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో అక్రమార్కు లకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. జిల్లాలో అక్రమ వ్యాపారం జోరుగా కొనసాగుతోంది. పేదలకు అందించాల్సిన బియ్యం అక్రమ వ్యాపారులతోపాటు జిల్లాలో కొందరు రేషన్ డీలర్లు అక్రమ వ్యాపారులతో చేతులు కలిపారని ఆరోపణలు ఉన్నాయి అదేవిధంగా అక్రమంగా పోగుచేసిన పిడిఎస్ రైస్ ను కొన్ని బిల్లులకు తరలిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. . టన్నుల కొద్ది రేషన్ బియ్యం ప్రైవేటు వ్యాపారుల గోదాంలలోకి చేరుతున్నాయి అనేది విమర్శ. . ఈ మాఫియా గుట్టుచప్పుడు కాకుండా ప్రతినెలా 3వ తేదీ నుండి 20 తేదీ మధ్యలో యథేచ్ఛగా కొనసాగుతుంది. బియ్యం దందా వ్యాపారులు . ప్రతిరోజు రాత్రి మొదలుకొని వేకువ జామువరకు ఎవరి కంట పడకుండా బియ్యాన్ని డీసీఎం, టాటా ఎస్ వాహనంలో జోరుగా సరిహద్దులు దాటిస్తున్నారు. జిల్లా ఎన్‌ఫోర్స్‌మెoట్, విజిలెన్స్, పోలీస్, రెవెన్యూ అధికారులు పకడ్బందీ నిఘాను ఏర్పాటు చేసి అక్రమ రవాణాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.క్వింటాళ్ల కొద్ది రహస్య స్థావరాల్లో నిల్వ చేసి వ్యాపారులకు అధిక ధర లకు విక్రయించుకుంటున్నారు. రేషన్ దుకాణాల్లో రూ.1కిలో ఉండగా.. బహి రంగ మార్కెట్‌లో రూ.20 వరకు విక్రయిస్తున్నారు.
రేషన్ షాపులవద్ద , వ్యాపారుల దందా
వ్యాపారులు రేషన్ షాపులకు వచ్చే వినియోగదారుల నుండి కిలో బియ్యాన్ని 8 రూపాయల నుండి పది రూపాయలకు కొనుగోలు చేసి కొనుగోలు చేసి ట్రాలీలో ద్విచక్ర వాహనాల పైన తరలిస్తారు. అది ఫోను ఇల్లులు తిరుగుతూ బియ్యాన్ని సేకరించి గ్రామంలో రహస్యంగా ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ కు తరలిస్తారు అలా ఏమైంది తరలించిన బియ్యాన్ని వ్యాపారులు పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని పోగు చేసి రైస్‌మిల్ల ర్లకు సైతం విక్రయిస్తున్నారు. రైస్‌మిల్లర్లు వ్యాపారుల నుంచి కొనుగోలు చేసిన బియ్యాన్ని ప్రభుత్వానికి తిరిగి అంటగడుతున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి.అనర్హులకి రేషన్ కార్డులు జారీ చేయడం ద్వారా పిడిఎస్ రైస్ జిల్లాలో ఏళ్లకొద్ది రేషన్ కార్డులు మార్పులు చేర్పులు చేయకపోవడం ద్వారా ఉద్యోగస్తులైన కొందరికి పెళ్లిలై వేరే ప్రాంతానికి వెళ్ళిన మరికొందరికి ఎస్ కే ఎస్ సమగ్ర కుటుంబ సర్వే లో పొద్దుపరిచిన పరిచిన నిబంధనలకు విరుద్ధంగా రేషన్ కార్డులు జారీ చేయడం ద్వారా సంపన్నులైనా వారు అక్రమ వ్యాపారులకి పిడిఎస్ రైస్ అమ్ముతున్నారనే విమర్శ బలంగా ఉంది…. మరిన్ని వివరాలు రేపటి అగ్నిధార దినపత్రికలో చూడవచ్చు.

