*అగ్నిధార న్యూస్ నస్పూర్*
మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ 17వ వార్డు హిమ్మత్ నగర్ లో నివాసముంటున్న సుందిళ్ల గణేష్ అనే యువకునికి అతని వైకల్యం చేత ఇటీవల పింఛను మంజూరు చేసి కార్డు కూడా ఇవ్వడం జరిగింది. అయితే అతని తండ్రి సింగరేణి కార్మికుడు అవడం వల్ల అతని పించను రద్దు చేశారు. కానీ సింగరేణి రిటైర్డ్ అయ్యి సింగరేణి పింఛన్ పొందుతూ ఉన్న వాళ్లకు కూడా ఇటీవల పింఛన్ మంజూరు చేశారు. రద్దయిన పింఛన్లకు సమాధానం చెప్పాల్సింది పోయి, స్థానిక అధికార పార్టీ కౌన్సిలర్ ఇటీవల కౌన్సిలర్లకు 5000 రూపాయలు పించను మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం హాస్యాస్పదంగా ఉంది. ఇదీ తెరాస ప్రజా ప్రతినిధుల తీరు, ఇప్పటికైనా అర్హులైన వారికి, రద్దయిన వారందరికీ పింఛన్లు వెంటనే మంజూరు చేయాలని నస్పూర్ కాంగ్రెస్ పార్టీ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ వనపర్తి రాజేష్ యూత్ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేశారు.
