అగ్నిధరన్యూస్ “(సంగారెడ్డి )”
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలోని కర్చల్ గ్రామంలోఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ సింగీతం  ఆధ్వర్యంలో గురువారం రోజు గ్రామ సభ నిర్వహించడం జరిగింది . సంగారెడ్డి రిజినల్ ఆఫీస్ నుండి వచ్చినటువంటి డీఓ ఎన్ పిఏ సత్తిరెడ్డి మాట్లాడుతూ… రైతులు తీసుకున్నటువంటి పంట రుణాలను సకాలంలో తిరిగి రెన్యువల్, చేయించుకోవాలన్నారు ఇలా ప్రతి సంవత్సరం లోపు రెన్యూవల్ చేయించుకుంటే వడ్డీ తక్కువగా  7% ఉంటుంది ఒక సంవత్సరం దాటితే 14% వడ్డీ ఉంటుంది అన్నారు. ప్రతి రైతు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులొ ఇన్సూరెన్స్ చేయించుకోవాలన్నారు .ఏదైనా  అనుకోని ప్రమాదం జరిగితే ఆ ఇన్సూరెన్స్ డబ్బులు కుటుంబానికి మేలు చేస్తాయని  అన్నారు.ఈ కార్యక్రమంలో డీఓ ఎన్ పి ఏ సత్తిరెడ్డి ,ఫీల్డ్ ఆఫీసర్ విజయ్ కుమార్ ,ఫీల్డ్ ఆఫీసర్ రంజిత్ కుమార్ ,క్యాషియర్ రవీందర్, గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి ,బ్యాంక్ సిబ్బంది రెవనయ్య స్వామి ,గ్రామ ప్రజలు ,రైతులు ,తదితరులు పాల్గొన్నారు .