అగ్నిధరన్యూస్ “(సంగారెడ్డి )”
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని జీర్లపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఝరాసంగం వారి ఆధ్వర్యంలో గురువారం నాడు గ్రామ సభ నిర్వహించడం జరిగింది . సంగారెడ్డి రిజినల్ ఆఫీస్ నుండి వచ్చినటువంటి డీఓ అడ్వాన్సెస్ మహీంద్రా మాట్లాడుతూరైతులు తీసుకున్నటువంటి పంట రుణాలను సకాలంలో తిరిగి రెన్యువల్ చేయించుకోవాలన్నారు ఇలా ప్రతి సంవత్సరం లోపు రెన్యూవల్ చేయించుకుంటే వడ్డీ తక్కువగా అనగా 7% ఉంటుంది ఒక సంవత్సరం దాటితే 14% వడ్డీ ఉంటుంది అన్నారు. ప్రతి రైతు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులొ ఇన్సూరెన్స్ చేయించుకోవాలన్నారు . రైతులకు అందుబాటులో గ్రామీణ వికాస్ బ్యాంక్ సేవలు అందుబాటులో ఉంటాయి అన్నారు. ఏదైనా ప్రమాదవశాత్తూ ప్రమాదం జరిగితే ఆ ఇన్సూరెన్స్ డబ్బులు కుటుంబానికి మేలు చేస్తాయని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో డీఓ అడ్వాన్సెస్ మహీంద్రా,బ్రాంచ్ మేనేజర్ నుార్ మొహమ్మద్,క్యాషియర్ రవితేజ , బ్యాంక్ సిబ్బంది గురు ,గ్రామ ప్రజలు ,రైతులు ,తదితరులు పాల్గొన్నారు .