అగ్నిధారన్యూస్ (ఓదెల)  పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలం మానేరు నదిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక క్వారీల కారణంగా నిత్యం వందలాది లారీలు హెవీ లోడుతో ప్రయాణించడంతో రోడ్లు విధ్వంసానికి గురవుతున్నాయని, ఆటోలు నడపలేకపోతున్నామని వాపోతూ, పొత్కపల్లిలో ఆటో డ్రైవర్లు నిరసన వ్యక్తం చేస్తూ రాస్తారోకో నిర్వహించారు.మడక నుండి గుంపుల వరకు గల రోడ్డుపై తమ ఆటోలు ఏమాత్రం ప్రయాణించలేని దుస్థితి ఏర్పడిందని తమ జీవనోపాధి దెబ్బతినడంతోనే తాము గత్యంతరం లేని పరిస్థితులలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. ఆర్ అండ్ బి అధికారులు, ప్రభుత్వ  పెద్దలు వెంటనే స్పందించి, రోడ్డును బాగు చేయాలని  కోరారు. రోడ్డుపై రోజు తమ వాహనాలను నడుపుతనే తమ జీవితం గడుస్తుందని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు కల్పించుకొని ఈ దారి వెంట పరిమితికి మించి నడుస్తున్న ఇసుక లారీలను నియంత్రించాల్సిన అవసరం ఉందని అన్నారు.