తెలంగాణ లెక్చరర్స్ ఫోరం ( టి ఎల్ ఎఫ్) రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ,అధ్యాపక అవార్డు కు ఎంపికైన ఆవుల రాజేష్ యాదవ్.

అగ్నిధారన్యూస్( రామగుండం )  కరీంనగర్ కృషి భవన్ లో తెలంగాణ లెక్చరర్స్ ఫోరం( టి ఎల్ ఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ, అధ్యాపక అవార్డు ప్రధాన ఉత్సవ కార్యక్రమం లో టి ఎల్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాతీయ ఎన్సీఈఆర్టీ నెంబర్ డాక్టర్ మురళి మనోహర్ సిద్దేశ్వర్ చేతుల మీదుగా ఆవుల రాజేష్ యాదవ్ ను శాలువతో సన్మానించి ప్రశంసపత్రం, జ్ఞాపకను అందజేశారు.
జిల్లా,రాష్ట్రవ్యాప్తంగా పది సంవత్సరాల నుండి ప్రైవేట్,ఉపాధ్యాయ అధ్యాపక సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న రాజేష్ యాదవ్ సేవలను గుర్తించి ఈ అవార్డును అందజేస్తున్నట్లు రాష్ట్ర సమన్వయకర్త పోకల నాగయ్య తెలిపారు, రాజేష్ యాదవ్ మాట్లాడుతూ ఈ అవార్డు ఎంపిక చేసిన రాష్ట్ర సమన్వయకర్త పోకల నాగయ్య ,రాష్ట్ర అధ్యక్షులు మురళి మనోహర్, సిద్దేశ్వర్,యాదయ్య లకు టి ఎల్ ఎఫ్ పెద్దపల్లి జిల్లా,బాధ్యులు అందరికీ పేరుపేరు నా కృతజ్ఞతలు తెలియజేశారు.