■ నంబర్ ప్లేట్ సరిగా లేని వాహనాలపై పెద్దపల్లి పోలీస్ స్పెషల్ డ్రైవ్.
■ తనిఖీల్లో పాల్గొన్న ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్.సీఐ ప్రదీప్ కుమార్.
అగ్నిధారన్యూస్ పెద్దపల్లి జిల్లా (రామగుండం పోలీస్ కమిషనరేట్) పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనర్ పరిధిలో జిల్లా కేంద్రంలో బుధవారం రోజు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్, పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్, ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు పెద్దపల్లి బస్టాండ్ అయ్యప్ప టెంపుల్, కమాన్ చౌరస్తా, సుల్తానాబాద్ పట్టణం లో పెద్దపల్లి పోలీస్, ట్రాఫిక్ పోలీస్ ల ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు నంబర్ ప్లేట్ లేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ఈ స్పెషల్ డ్రైవ్ లో నెంబర్ ప్లేట్ సరిగ్గా లేని 40 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రతి ఒక్క వాహనదారుడు ఆర్టిఏ అప్రూవల్ నెంబర్ ప్లేట్ ధరించాలని సూచించారు. చాలా మంది వాహనదారులు నెంబర్ ప్లేట్ పై స్టికర్ అతికించడం నెంబర్ ప్లేట్ వంచడం, విరగొట్టడం, చేత వాహనాలు ప్రమాదాలు జరిగినప్పుడు నేరాలు జరిగినప్పుడు వాహనాలను గుర్తించడంలో ఇబ్బందులు ఏర్పడుతున్న దృశ్య కచ్చితంగా వాహనదారులు నిబంధనలు పాటించాలని హెచ్చరించారు. ఉద్దేశపూర్వకంగా నెంబర్ ప్లేట్లు కనపడకుండా ప్రయత్నం చేసే వారి పైన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా దురుద్దేశంతో ఈ పనులు చేసిన వారిపై చీటింగ్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.స్వాధీన పర్చుకున్న వాహనాలపై జరిమానాలు విధించి, సరైన నెంబర్ ప్లేట్ తీసుకువచ్చిన తర్వాతే వాహనాలు రిలీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈకార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.
