అగ్నిధారన్యూస్ ( కరీంనగర్ జిల్లా) గురువారం రోజు హ్యూమన్ రైట్స్ (HRPM)ఆఫీసులో. జిల్లా అధ్యక్షులు ఆకుల చందు  ప్రధాన కార్యదర్శి మొగిలి సతీష్ అత్యవసర సమావేశం జరిగినది,   ప్రధానంగా  వైద్య వ్యవస్థ గురించి చర్చించడం జరిగినది. ప్రవేట్ ఆసుపత్రిలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి వ్యవస్థ కరీంనగర్ లో చాలావరకు ఉన్నది.  ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఫీజుల నియంత్రణ అరికట్టాలని, ఫీజుల గురించి ప్రతి హాస్పిటల్లో  మెనూ పెట్టాలని  ప్రతి హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది (ఏఎన్ఎం)  క్వాలిఫై అయి ఉండాలని అర్హత లేని  అమ్మాయిలను,అబ్బాయిలను పెట్టి నడిపిస్తున్న   దవాఖానాలపై చర్యలు తీసుకోవాలన్నారు క్వాలిఫైడ్ ట్రైనింగ్ తీసుకున్న వారిని హాస్పటల్లో నియమించాలని డిమాండ్ చేశారు. ఇట్టి విషయంపై  కరీంనగర్ DHMO దృష్టి సారించాలని అన్నారు. కార్యక్రమంలో  జిల్లా ఉపాధ్యక్షులు పుల్కం నర్సయ్య, మీలుకూరి తిరుపతిరెడ్డి, అoడేo ప్రభాకర్ రెడ్డి, పాల్గొనడం జరిగినది.