గాయత్రి విద్యా నికేతన్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు…..
అగ్నిధార న్యూస్ (పెద్దపల్లి) జిల్లా కేంద్రంలో గాయత్రి విద్యా నికేతన్ పాఠశాలలొ సోమవారం రోజు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి బతుకమ్మ పాటలు పాడుతూ చేసిన నృత్యాలు మన తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల గొప్పదనాన్ని తెలియజేశాయి. ఈ సందర్భంగా గాయత్రి విద్యా సంస్థల ఛైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ మాట్లాడుతూ… మన తెలంగాణ సంప్రదాయాల గొప్పదనం, ఆచార వ్యవహారాలు నేటి తరం పిల్లలకు కూడా తెలియాలనే ఉద్దేశ్యంతో ప్రతి ఏటా కార్యక్రమాలను నిర్వహిస్తామని అన్నారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ రజనీ, శ్రీనివాస్ విద్యార్థినులతో కలిసి నృత్యం చేసి వారి ఆనందంలో పాలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విజయ్, రజియుద్దీన్, ఉపాధ్యాయ బృందం, విద్యార్ధినీ విద్యార్ధులు పాల్గొన్నారు.

