వాగును చెరబడుతున్న దుండగులు.

వాగులో ఆగని ఇసుక మట్టి మాఫియా.

పట్టించుకోని అధికారులు చోద్యం చూస్తున్న పాలకవర్గం

జలజలా పారే  సెలయేరు వెలవెలబోతుంది 

అగ్నిధారన్యూస్(  పెద్దపల్లి ) పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ గ్రామ పరిధిలోని హుస్సేన్ మియా వాగులో గ్రామ ప్రజల అవసరాల కోసం ఇసుక తీసుకుంటే తప్పులేదు కానీ ఇసుక మట్టిని అక్రమ దందాగా తయారుచేసి ఇసుక మట్టి కాజేసి వాగు నామరూపాలు లేకుండా చేసి మట్టి మాఫియా కోరలు చాసి వాగులోని భూమిని ప్రోక్లైన్లతో అక్రమంగా చరబడుతున్నారు. సహజ సిద్ధమైన సంపద అక్రమార్కుల పాలిట వరంగా మారి కోట్లాది రూపాయల సంపదను కొల్లగొడుతున్నారు. చీకటి పడితే చాలు పెదబొంకూరు వాగు మట్టి మాఫియా చేతుల్లో గజగజలాడుతుంది. ఆ ప్రాంతమంతా చీకటి సామ్రాజ్యం ఏలుతుంది. పట్టించుకోవాల్సిన రెవెన్యూ అధికారులు అటువైపు చూసిన పాపాన పోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జలజల పారే సెలయేరు విలవిల కొట్టుకుంటుంది. కాపాడమని వాగు ఆక్రోషిస్తుంది. పట్టించుకోవాల్సిన పాలకులు మాకేం పని అన్నట్లు చోద్యం చూస్తున్నారు… సోమవారం రోజు ప్రజావాణిలో పెద్దబొంకూర్ ఎంపీటీసీ మిట్టపల్లి వసంత వెంకటేశం హుస్సేన్ మియా వాగులో జరుగుతున్న అక్రమ ఇసుక మట్టి తవకాలపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. వాగులో జరుగుతున్న అక్రమాలను నివారించనట్లయితే ప్రభుత్వంపై నిరసన కార్యక్రమం తెలియజేస్తానని తన ఫిర్యాదులో తెలిపారు.