గాయత్రి కళాశాల కరస్పాండెంట్ శ్రీనివాస్
అగ్నిధార న్యూస్ (పెద్దపల్లి) శనివారం రోజు పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి డిగ్రీ అండ్ పిజి కళాశాల వార్షికోత్సవ వేడుకలు బందంపల్లి లోని స్వరూప గార్డెన్స్ లో అట్టహాసంగా నిర్వహించారు. గాయత్రి విద్యా సంస్థల ఛైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… విద్యార్థులు అభ్యసించిన విద్య కేవలం మార్కుల కోసం కాకుండా భవిష్యత్ లో మన జీవితంలో మనకు ఉపయోగపడే విధంగా ఉండాలనీ, గతంలో జరిగిన వైఫల్యాలను మర్చిపోయి, ముందు ఉన్న ఉజ్వల భవిష్యత్ కై కలలు కంటూ, ఓటమి నుండి పాఠం నేర్చుకొని, ఆ వైఫల్యాలనే సోపానాలుగా మలచుకొని బంగారు భవితకోసం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల అసలైన జీవితం ఇప్పుడే మొదలవబోతోందని, అందుకే గతం గురించి మర్చిపోయి జీవితంలో ఎలా స్థిరపడాలి అనే విషయం పై దృష్టి పెట్టి, ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న అరవింద్ అనే విద్యార్థి రూపొందించిన గాయత్రి బుక్స్. వెబ్సైట్ ని ప్రారంభించారు. కళాశాల సెమిస్టర్ టాపర్స్ కి, బెస్ట్ లెక్చరర్స్ కి, అలాగే ఇటీవల నిర్వహించిన ఎన్ ఎస్ ఎస్ స్పెషల్ క్యాంప్ లో పాల్గొని సేవ చేసిన విద్యార్థినీ విద్యార్థులకి ఛైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ చేతుల మీదుగా సర్టిఫికేట్లు, మెమొంటోలు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ అలరించాయి.ఈ కార్యక్రమానికి ప్రముఖ యాంకర్ మహేష్ రాజు వచ్చి విద్యార్థులను ఉతేజ పరిచారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్, జూనియర్ కాలేజి ప్రిన్సిపాల్ సురేష్, గాయత్రి విద్యాసంస్థల కరస్పాండెంట్ అల్లెంకి రజనీ శ్రీనివాస్, అధ్యాపక బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

