అక్రమ మట్టి ఆపాలి.
పట్టించుకోని అధికారులు.
చోద్యం చూస్తున్న ప్రజా ప్రతినిధులు.
పంచాయతీ కార్యాలయానికి చేరిన పంచాయతీ.
సమాధానం చెప్పని పంచాయతీ కార్యదర్శి.
వేబిల్లులు లేకుండానే మట్టి తరలింపు.
అదుపు చేయలేని అధికారులు.
ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు.
అగ్నిధారన్యూస్ పెద్దపల్లి:పెద్దపల్లి జిల్లామట్టి మాఫియా అడ్డాగా మారి అడ్డదారుల్లో మట్టి తరలించకపోతున్న అదుపు చేయాల్సిన అధికారులు ప్రజాప్రతినిధులు మాకేమి సంబంధం లేదన్నట్లు చోద్యం చూస్తున్న తీరు నిరసిస్తూ పెద్దపల్లి మండలం రాఘవపురం గ్రామపంచాయతీ కార్యాలయాన్ని వివిధ పార్టీల నాయకులతోపాటు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి పంచాయతీ కార్యదర్శి శ్రీధర్, వెంకటేశం సర్పంచులను నిలదీశారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకులు శిలారపు పర్వతాలు తాడిశెట్టి శ్రీకాంత్ మాట్లాడుతూ… రాఘవపురం గ్రామపంచాయతీ పరిధిలో గల పెద్ద చెరువు నుండి గత సంవత్సరం పెద్ద ఎత్తున అక్రమ మట్టి తవ్వకాలు చేపట్టారన్నారు అనుమతులకు మించి అక్రమాలకు పాల్పడ్డారన్నారు జిల్లా మైనింగ్ శాఖ ద్వారా కేటాయించిన స్థలాలలో కాకుండా వ్యవసాయ భూములలో రెవెన్యూ అధికారుల నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా వ్యవసాయేతర భూములుగా మార్చి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. చెరువులో మట్టి తీస్తున్న సందర్భంగా గ్రామపంచాయతీ ఆవరణంలో గ్రామసభ ఏర్పాటు చేసి గ్రామాభివృద్ధికి ఒకటిప్పరకి 350 రూపాయల చొప్పున గ్రామానికి మట్టి నిర్వాహకులు కేటాయిస్తామన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు పంచాయతీ కార్యదర్శి ఎలాంటి వే బిల్లులు ఇవ్వకుండానే నిర్వాహకులు అక్రమట్టి తరలిస్తున్న సందర్భంగా గ్రామ ప్రజలు వివిధ పార్టీల నాయకులు గ్రామపంచాయతీ కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చి గ్రామాభివృద్ధికి ఇస్తామన్న డబ్బులు ఇవ్వాలని అడుగుతే సమాధానం దాటవేస్తూ సమావేశం నుండి పంచాయతీ కార్యదర్శి సర్పంచ్ వెళ్లిపోవడం బాధాకరమన్నారు. గ్రామంలో జరుగుతున్న అక్రమ మట్టి రవాణా పైన గతంలో జిల్లా కలెక్టర్ మైనింగ్ ఏడి ఆర్డిఓ ఎంఆర్ఓ లకు ఫిర్యాదు చేసిన ఎవరు పట్టించుకున్న దాఖలు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి తరలుతున్న అక్రమ మట్టి రవాణాలను అరికట్టాలని లేనట్లయితే వివిధ పార్టీల నాయకులు ప్రజల చేత ఒకటి రెండు రోజులలో జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
