*బోథ్ నియోజకవర్గం బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అనిల్  పేరును ఖరారు చేసిన సీఎం కేసీఆర్*

అగ్నిధారన్యూస్, బోథ్:-

సీఎం కేసీఆర్ ఎన్నికల సమర శంఖాన్ని పూరించారు. బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా అనిల్ జదవ్ పేరును ఖరారు చేస్తూ సీఎం కేసీఆర్ ప్రకటించారు సోమవారం హైదరాబాదులోని ప్రగతి భవన్ లో టిఆర్ఎస్ అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేశారు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు ఈసారి మొండి చేయి చూపారు

*ఇద్దరికీ ఎదురుదెబ్బ…*

తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తరువాత రెండు సార్ల ఎమ్మెల్యేగా రాథోడ్ బాపూరావు గెలుపొందారు చటక మూడోసారి ఎమ్మెల్యే టికెట్ను సిట్టింగ్ ఎమ్మెల్యే ఆశించారు. మరోవైపు మాజీ మంత్రి మాజీ ఎంపీ గూడెం నాగేష్ కూడా ఎమ్మెల్యే టికెట్ పై మొదటి నుంచి గంపెడాశలు పెట్టుకున్నారు. ఈసారి కచ్చితంగా మాజీ ఎంపీ గుడం మానేసి టికెట్ వస్తుందని అనుచరులు నాయకులు జోరుగా ప్రచారం చేశారు సీనియర్ నేతలు బలమైన క్యాడర్ కలిగి ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ ఎంపీ ని కాదని నేరాడిగొండ జెడ్పిటిసి అనిల్ యాదవ్ వైపు మొగ్గు చూపారు. బోథ్ నియోజకవర్గంలో మొదటి నుంచి సీఎం కేసీఆర్ సొంతంగా సర్వేలు నిర్వహించారు ఇప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లు తెప్పించుకున్నాడు. ఈసారి బోథ్ ఎమ్మెల్యే అభ్యర్థి మార్పు కధమని అధిష్టానం భావించింది.

ఎమ్మెల్యేలకు బుజ్జగింపులు…

సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు సోమవారం తెల్లవారుజామున మరోసారి ప్రగతి భవన్ నుంచి పిలుపు రావడంతో హాటాహుటిన హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. తాజాగా నిర్వహించిన సర్వేలో వ్యతిరేకత ఉందని ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థి మార్పు తప్పదని సిట్టింగ్ ఎమ్మెల్యేతో చెప్పినట్లు సమాచారం అతడిని ఎమ్మెల్సీగా నియమిస్తామని బిఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జదవ్ గెలుపుకు సహకరించాలని సీఎం కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తుంది. ఇటు ఎమ్మెల్యే అటు మాజీ ఎంపీ కి టికెట్ రాకపోవడంతో ఇరు వర్గాల అనుచరులు నాయకులు కార్యకర్తలు నిరాశకు లోనయ్యారు టికెట్ విషయంలో ఎవరికి వారు విశ్వ ప్రయత్నాలు చేశారు కానీ ఇద్దరికీ టికెట్ రాలేకపోవడం రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు