చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడొద్దు
డి.ఎం.అండ్ హెచ్.ఓ. డాక్టర్ కె.ప్రమోద్ కుమార్
అగ్నిధారన్యూస్, పెద్దపల్లి:
జిల్లాలోని ఏ హాస్పిటల్లో నైనా గర్బస్థ లింగ నిర్ధారణ కార్యక్రమాలకు పాల్పడితే, చట్ట వ్యతిరేకమని, ఇందుకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె. ప్రమోద్ కుమార్ హెచ్చరించారు.
మంగళవారం గోదావరిఖనిలో గల లోటస్ స్కానింగ్ సెంటర్, అనిల్ డయాగ్నోస్టిక్స్ , శ్రీ అధితి మెటర్నిటి హాస్పిటల్ లలో వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది తనిఖి నిర్వహించారని డి.ఎం.అండ్ హెచ్. ఓ. ప్రమోద్ కుమార్ తెలిపారు.
డాక్టర్ కె. ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ గర్బస్థ శిశువుగా ఉన్నప్పుడు స్త్రీ, పురుష లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లయితే పరీక్షలు చేసిన వారికి, చేయించుకున్న వారికి, అందుకు ప్రోత్సహించిన వారికి చట్టప్రకారం మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, 50 వేల రూపాయలు జరిమాన విధించబడు తుందని, అలాగే కఠిన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు.
పుట్టబోయే బిడ్డ ఎవరైనా సమానంగా ఆదరించాలని, స్కానింగ్ సెంటర్, నర్సింగ్ హోం లకు వచ్చే గర్భిణీలకు, వారి బంధువు లకు కౌన్సెలింగ్ నిర్వహించాలని అన్నారు. నర్సింగ్ హోం ల యందు గర్భిణీ స్త్రీల యొక్క పూర్తి వివరాలు నమోదు చేయాలని, నార్మల్ డెలివరీ లను ప్రోత్స హించాలని అన్నారు.
స్కానింగ్ సెంటర్ లు గర్బస్థ పూర్వ, గర్బస్థ లింగ నిర్దారణ చట్టం – 1994 ప్రకారం నడుచుకోవాలని, ఫామ్- ఎఫ్ లో గర్భిణి అనుమతి పత్రం తీసుకొవాలని, పూర్తి వివరాలు నింపాలని, అట్టి రికార్డ్స్ రెండు సంవత్సరముల వరకు భద్రపరచాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ స్వప్నలత, డిప్యూటి డెమో యస్. వెంకటేశ్వర్లు, డి.డి.ఎమ్ సి.హెచ్. మహెందర్, ఎపిడమాలజిష్ట్ జె. నరెష్, తదితరులు పాల్గోన్నారు.
