అధికారంలోకి రాగానే అన్ని సమస్యలు పరిష్కరిస్తాం
బీ ఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మొద్దు
మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు
అగ్నిధారన్యూస్ (జూలపల్లి)
హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమంలో భాగంగా గడప గడపకు కాంగ్రెస్ పార్టీ – పల్లే పల్లెకు విజ్జన్న అనే నినాదంతో జూలపల్లి మండలంలోని చీమలపేట గ్రామంలో పాదయాత్ర చేసిన టీపీసీసీ ఉపాధ్యక్షులు, పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు.
ఈ సందర్భంగా, పాదయాత్రలో చీమలపేట గ్రామంలోని బీ ఆర్ఎస్, బిజెపి పార్టీలకు చెందిన మొగిలి, గణేష్, రాజేష్, వెంకటేష్, రంజిత్, ఎన్. వెంకటేష్, జగదీష్, సతీష్, రాజ్ కమల్, రాజేందర్, రాజు, శ్రీనివాస్, సంజయ్, వంశీ, హరీష్, వినయ్, విశ్వతేజ, విజయ్, రాజు, శివతేజ, శ్రీనివాస్ ,సతీష్,సజీవ్, రామ్, నరేందర్, కుమార్, చందు,సంజీవ్,కే.అజయ్, వినయ్, ఎమ్. అజయ్, సాయి, విజయ్, వి.అజయ్ పలువురు యువకులు, నాయకులు విజయరమణ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సంధర్బంగా విజయరమణ రావు మాట్లాడుతూ..
మంగళవారంరోజు సాయంత్రం జూలపల్లి మండలంలోని చీమలపేట గ్రామంలో పాదయాత్రగా ప్రతీ గడపకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకొని ప్రజలతో అడుగులో అడుగు వేసుకుంటూ పాదయాత్ర చేయడం జరిగింది అని, ఈ గ్రామంలో నేను పాదయాత్ర చేస్తుంటే ప్రజలు మాకు అనేక సమస్యలు వివరించడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి చీమలపేట ప్రజలను పట్టించుకోకుండా కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. ఈ గ్రామంలో నివసిస్తున్న ప్రజలకు పూర్తి స్థాయిలో పెన్షన్ లు అందించకుండా పబ్బం గడుపుతున్నాడని ప్రభుత్వం స్ధానిక ఎమ్మెల్యే పైన విరుచుపడ్డారు. రానన్ను రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే, మీకు ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు రాకుండా ఉంటాయని కాంగ్రెస్ పార్టీ పేద, ప్రజలందరికీ అండగా నిలిచి గొప్ప సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చారు.
నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్ రూం కూడా మంజూరు చేయకుండా పబ్బం గడుపుతున్నారు అని ఈ మండిపడ్డారు.
బీ ఆర్ఎస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వాలు గ్యాస్, పెట్రోల్, డీజిల్ నిత్యవసర ధరలు పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తున్నాయని మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో , కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిదులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామ మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

