రెండు లారీలు ఢీ కొని ఒకరు మృతి.
ఎగసిపడుతున్న మంటలను అదుపు చేసిన అగ్నిమాపక అధికారులు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న సుల్తానాబాద్ పోలీసులు.
అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్
శుక్రవారం రాత్రి సుల్తానాబాద్ మండల పరిధిలోని జాతీయ రహదారి కాట్నాపల్లి గ్రామం సమీపంలో రాజీవ్ రహదారిపై రెండు లారీలు ఢీకొన్న ఘోర సంఘటనలు వెనక లారీలో ఉన్న లారీ డ్రైవర్ మృతి చెందాడు. మృతుదేహం గుర్తుపట్టలేనంతగా మాంస ముద్దలుగా మారిందని పెద్దపల్లి అగ్నిమాపక అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా అగ్నిధార ప్రతినిధి పెద్దపల్లి ఫైర్ అధికారిని చరవాణిలో సంప్రదించగా ఆయన తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ నుండి పెద్దపల్లి వైపు రెండు లారీలు వస్తున్నాయి, ముందు లారీ వరి ధాన్యంతో వస్తుండగా, వెనక లారీ పేపర్ బెండలతో వస్తుంది అన్నారు. ఈ క్రమంలో రెండు లారీలు ఢీకొనగా ఒక్కసారిగా పెను మంటలు చెలరేగడంతో అగ్నిఖిలలు ఎగసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బందికి అందిన సమాచారం మేరకు పెద్దపల్లి నుండి ఫైర్ వాహనంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పామన్నారు. ఈ క్రమంలో మంటలు ఎగిసిపడడంతో కరీంనగర్ నుండి మరొక ఫైర్ ఇంజన్ ని తెప్పించి మరింత పని ప్రమాదం జరగకుండా రెండు గంటల పాటు శ్రమించామన్నారు ఈ సంఘటనలో ఎంత మేరకు ఆస్తి నష్టం వాటిలిందనే సమాచార వివరాలను సేకరిస్తామన్నారు. సుల్తానాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



