రాహుల్ గాంధీ సభకు ప్రజలు తరలిరావాలి.

ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తాం.

నాయకులతో కలిసి బహిరంగ సభసభాస్థలి పరిశీలించిన.

ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీకి ఘన స్వాగత ఏర్పాట్లు పూర్తి.

-టిపిసిసి కార్యదర్శి పెర్క శ్యామ్.

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి: తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా,కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి టిపిసిసి కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన విజయభేరిలో బస్సు యాత్ర బుధవారం ములుగు నుండి ప్రారంభించిన బస్సు యాత్ర నేడు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోకి    ప్రవేశించిన నేపథ్యంలో పార్టీ అగ్రనేతలైన రాహుల్ గాంధీ, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, ఇతర ప్రముఖులు పెద్దపల్లికి వస్తున్న సందర్భంగా, గురువారం సాయంత్రం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభకు జిల్లా నలుమూలల నుండి ప్రజలు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు,అభిమానులు,వివిధ అనుబంధ సంఘాల నాయకులు,అందరూ పెద్ద ఎత్తున సభాస్థలికి  తరలిరావాలని, ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని  టిపిసిసి కార్యదర్శి,పెద్దపల్లి పార్లమెంటు నాయకులు పెర్క శ్యామ్  విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభాస్థలిని స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు.