నూగిళ్ళ మల్లయ్యమాజీ వైస్ చైర్ పర్సన్

అగ్నిధరన్యూస్, పెద్దపల్లి టౌన్:పెద్దపల్లి పట్టణంలో కునారం రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మా ఫ్రెష్ మార్కెట్ ను కాంగ్రెస్ నాయకులు, పెద్దపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్ పర్సన్ నూగిళ్ళ. మల్లయ్య చేతుల మీదుగా ప్రారంభం చేశారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ నేటి యువత స్యయం ఉపాధి కోసం తనకు నచ్చిన రంగంలో వ్యాపారం చేసుకుంటే వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుందని తెలిపారు.తెలంగాణలో కొత్తగా ఏర్పడిన ప్రజాప్రభుత్వంలో యువతకు ఉద్యోగ అవకాశాలు రాబోయే రోజుల్లో అధ్బుతంగా వుంటాయని,ప్రతి ఒక్కరూ జీవితంలో స్థిర పడడానికి అన్ని అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డాక్టర్.జవ్వాజి.రాజేష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో నిరుద్యోగుల కోరిక మేరకు ఉద్యోగ రాత పరీక్షలు జరిపి,త్వరగా ఉద్యోగాలు వచ్చేలా త్వరితగతన చర్యలు జరుగుతుండం ముదావహం అని కొనియాడారు.ప్రతి యువతకు ప్రభుత్వం తోడ్పాటు కోసం పలు రకాల స్వయం ఉపాధి కోసం ఋణాలు అందించేలా ప్రభుత్వం కృషి చేసే అవకాశం ఉందని ఆశ భావం వ్యక్తం చేశారు.ఈకార్యక్రమంలో అంజవ్వ- ప్రశాంత్(19 వ వార్డ్ కౌన్సిలర్), యువ కాంగ్రెస్ నాయకులు ఈర్ల స్వరూప-సురేందర్,గుజ్జుల.కుమార్,డాక్టర్. జవ్వాజి.రాజేష్, డొంకెన.రవీందర్,అంజనేయ రావు,అమిరిశెట్టి.కృష్ణ,DVS మూర్తి,జాకీర్ భాయ్,కాలనీ వాసులు కిష్టయ్య  (Rtd పోస్ట్ మాస్టర్),

నడిపెల్లి.గోపాలరావు,నారాయణ రావు,ఆనంద రావు, బయ్యపు.మల్లయ్య యాదవ్, కొట్టే. లక్ష్మినారాయణ,కనపర్తి.రంగారావు,రాజ కొమురయ్య యాదవ్, ఆగయ్య యాదవ్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.