అగ్నిధారన్యూస్, పెద్దపల్లిజిల్లా:నిబంధనలకు విరుద్ధంగా ఓదెల మండలం మడక గ్రామం సర్పంచ్ ఉప సర్పంచ్ ఇద్దరు కలిసి  ( ఇసుక) వ్యక్తిగత బ్యాంక్ అకౌంటు కేడీసీసీ లో ఓపెన్ చేసి వచ్చిన డబ్బులను   కాజేసారని   అదే గ్రామానికి చెందిన వార్డ్ మెంబర్ రాజేశం 6.3.2023 రోజున చేసిన ఫిర్యాదు మేరకు ..15.4.2023 రోజున మండల పంచాయతీ అధికారి విచారణ చేపట్టారు తన విచారణలో    సర్పంచ్ మేడగొని భాగ్యమ్మ ఉప సర్పంచ్ కోట నిరంజన్ రెడ్డి ఇద్దరు కలిసి పది లక్షల 90 వేల 690 రూపాయలు    దుర్వినియోగం చేశారని నిర్ధారణ చేశారు.

22.12.2022.. రోజున రెండు లక్షల రూపాయలు 10.4.2023 రోజునఒక లక్ష రూపాయలు రూపాయలు…17.04.2023. రోజున నాలుగు లక్షల రూపాయలు..2.5.2023.. రోజున ఒక లక్ష రూపాయలు 10.5.2023 రోజున రెండు లక్షల 90 వేల రూపాయలుగా  లెక్కలు తేల్చారు. సర్పంచ్ ఉపసర్పంచ్ అధికార దుర్వినియోగంతోపాటు, నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఎంపీఓ ఉన్నత అధికారులకు నివేదిక సమర్పించగా  పంచాయతీ రాజ్ చట్టం 2018 లోని సెక్షన్ 37 ( 5 )ప్రకారం   పెద్దపల్లి జిల్లా కలెక్టర్, సర్పంచ్ ఉప సర్పంచ్ ఇద్దరినీ 14.12.2023 రోజున సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.