అగ్నిధారన్యూస్ ( హైదరాబాద్ )
టిపిసిసి మాజీ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి పెరక శ్యామ్ తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయనను
తెలంగాణ సచివాలయంలో తొలిసారిగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారిరువురూ, ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పార్టీ నాయకులు,కార్యకర్తలు, చేసిన కృషిని కొనియాడారు. ఇదే స్ఫూర్తితో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో, పార్లమెంట్ ఎన్నికలలో, కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతుందని ఆశ భావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్యామ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి పూల మొక్కను బహుమతిగా ఇచ్చారు.
