ప్రజాపాలనకు దరఖాస్తుల వెల్లువ. 

ప్రజాపాలన గ్రామ సభల పరిశీలన.

అధికారులకు పలు సూచనలు చేసిన పెద్దపల్లి డిసిపి చేతన.

అగ్నిధారన్యూస్, కమాన్ పూర్:

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఆరు గ్యారెంటీ పథకాలను అమలుకు కృషి చేస్తుంది. ప్రజా పాలన పేరుతో ప్రజల వద్దకే అధికారులు వెళ్లి ప్రజల అవసరాలకు అనుగుణంగా  వారి వద్ద నుండి దరఖాస్తులు స్వీకరించి, అర్హులైన వారికి పథకాలను అందించే విధంగా కృత నిశ్చయంతో పనిచేస్తుంది.

శుక్రవారం రోజు కమాన్ పూర్  మండలoలోని గొల్లపల్లి, పేరపల్లి,గ్రామాల్లో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలో ప్రజలు భారీ ఎత్తున పలు సమస్యలపై ధరఖాస్తులను అధికారులకు అందించారు… పేరపల్లి లో 319,గొల్లపల్లి లో 205 మంది లబ్ధిదారులు దరఖాస్తులు …చేసుకున్నారు.  పెద్దపల్లి డీసీపీ చేతన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కేంద్రాలను సందర్శించి కార్యక్రమం జరుగుతున్న తీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో విజయ్ కుమార్, తహసిల్దార్ మోహన్ రెడ్డి, కమాన్ పూర్ ఎస్ ఐ రాములు, డిప్యూటీ తాసిల్దార్ కోటేశ్వరరావు, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు  గ్రామ సర్పంచ్ లు పాల్గొన్నారు.