ప్రధాన కూడలిలలో ఆటోలతో అవస్థలు.

రహదారి నిబంధనలు పాతర.

రోడ్డు ఆక్రమిత వ్యాపార పై చర్యలేవి.

రోడ్డు మీద వ్యాపారం ప్రజల కు అసౌకర్యం.

జండా చౌరస్తాలో  ఇబ్బందులు.

చర్యలు చేపట్టాలి అంటున్న ప్రజలు.

అగ్నిధారన్యూస్(  పెద్దపల్లి ): పెద్దపల్లి జిల్లాలోని   పెద్దపల్లి పట్టణ మున్సిపాలిటీ పరిధిలో  రోడ్డుకిరువైపులా ఆక్రమిత  ప్రాంతంలో  వ్యాపారం చేస్తూ,   వ్యాపార వస్తువులను, వారి షాపుల ముందు ఉంచడం ద్వారా   జిల్లా నలుమూలల నుంచి, వివిధ అవసరాలరీత్యా, జిల్లా కేంద్రానికి   వస్తున్న ప్రజలు  రోజురోజుకు పెరుగుతున్నారు. దానితో పట్టణంలోని  రోడ్లన్నీ,జన సమూహాలతో వాహనదారులతో కిటకిటలాడుతున్నాయి. రోడ్డుకిరువైపులా తినుబండారాల షాపులు, టీ స్టాల్స్ ,హోటల్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్ లతో, ప్రధాన కూడళ్ళలోనే కాకుండా రాజీవ్ రహదారికి ఇరుపక్కల వ్యాపార సముదాయాలతో, వచ్చిపోయే జనంతో, ఆయా ప్రాంతాలు రద్దీగా తయారైంది . కమాన్ చౌరస్తా, జండా చౌరస్తా, మజీద్, అయ్యప్ప టెంపుల్, బస్టాండ్, కూడలిలలోనైతే ట్రాఫిక్ బాధలు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి గురువారం వారసంత జరగడంతో జెండా చౌరస్తా ప్రాంతం జనంతో కిక్కిరిసిపోతుంది. పండుగలు, పబ్బాలు వచ్చినప్పుడు జనం బాధలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.   వ్యాపారస్తులకు,షాపుల యజమానులకు ట్రాఫిక్ నిబంధనలపై కౌన్సిలింగ్  చేసేవారే కరువయ్యారు. ప్రమాదాల జరుగుతే తప్ప రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమిత వ్యాపార సముదాయాలను తొలగించాలని హడావిడి చేసే అధికారులు ఇప్పుడు ఎక్కడ ..? అని ప్రశ్నిస్తున్నారు. ఎందుకు పట్టించుకోవడంలేదని అంటున్నారు. గతంలో కరీంనగర్,సుల్తానాబాద్, పెద్దపల్లి, ప్రాంతాలలో రోడ్డుకి ఇరువైపులా ఉన్న వ్యాపార సముదాయాల మీదికి భారీ వాహనాలు దూసుకొచ్చిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఇప్పటికైనా ట్రాఫిక్ అధికారులు, మున్సిపల్ అధికారులు స్పందించి సమన్వయంతో చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

ఆటోలతో ఇక్కట్లు…

అసలే ఇరుకుదారులతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఆటోలు ఇబ్బంది పెడుతున్నాయి ఎక్కడ పడితే అక్కడ రోడ్ల పైన ఇరువైపులా ఆటో రిక్షాలను నిలిపివేసి పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులకు ఆటోలు కార్లు భారీ వాహనాలు కారణమవుతున్నాయి. నియంత్రించాల్సిన ట్రాఫిక్ సిబ్బంది, సిబ్బంది కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపాలిటీ అధికారులు మాకు సంబంధం లేదు అన్నట్లు వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశం.  వందల సంఖ్యలో ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా నిలుపుదల చేస్తున్న ఆటోలపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ట్రాఫిక్ పోలీస్ ఉన్నత అధికారుల పైన  ఉంది.

రోడ్లపైనే ఎక్కడబడితే అక్కడ నిలిచి ఉంచిన ఆటోలు, వాహనాలు.