గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.

అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్:  సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గర్రెపల్లి గ్రామం వద్ద రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులుకు వచ్చిన పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీలలో భాగంగా అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అదుపులో తీసుకొని  క్షుణ్ణంగా పరిశీలించగా 1.70 కిలోల గంజాయి పట్టుబడిందని ఆయన తెలిపారు. వివరాల్లోకి వెళితే కుక్కలగూడూరు గ్రామానికి చెందిన నలిమేల వినోద్ గంజాయి కి బానిసై గంజాయి తాగుతూ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో ఒడిస్సా లో గుర్తుతెలియని వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేసి సుల్తానాబాద్ పరిసర ప్రాంతాలలో విద్యార్థులకు, అమాయక యువతకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాడని పక్క సమాచారంతో నిందితున్ని పట్టుకొని సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరిగిందని ఆయన తెలిపారు. గంజాయి విక్రయించే వారి పట్ల ఉక్కు పాదం మోపుతామని హెచ్చరించారు.