ఉప సర్పంచుల సంఘం వనపర్తి జిల్లా అధ్యక్షుడు ఆవుల చంద్రశేఖర్ యాదవ్.
అగ్నిధారన్యూస్, వనపర్తిజిల్లా: జిల్లాలోని చందాపూర్ గ్రామపంచాయతీని అన్ని రంగాలలో ఆదర్శ గ్రామంగా నిలపడానికి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ఆర్థికంగా సహకరించాలని ఉప సర్పంచ్ ల సంఘం వనపర్తి జిల్లా అధ్యక్షుడు ఆవుల చంద్రశేఖర్ యాదవ్ మంగళవారం ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ యాదవ్ మాట్లాడుతూ చందాపూర్ గ్రామంలో పశు వైద్యశాలను, గ్రంథాలయ భవనాన్ని, నూతన గ్రామపంచాయతీని, ప్రాథమిక వైద్యశాలను,యువజన,మహిళా సంఘాల భవనాలు నిర్మించుటకు,క్రీడా మైదానాన్ని ఏర్పరచుటకు, డి-8 కాలువపై బ్రిడ్జి నిర్మాణానికి, రోడ్లు,డ్రైనేజీల నిర్మాణానికి ఆర్థికంగా సహకరించాలని, వనపర్తి నుండి చందాపూర్ వరకు ఉన్న రోడ్డును విస్తరణకు, మిషన్ భగీరథ సమస్యను తొలగించుటకు, శిథిలమైన పాత స్తంభాలను తొలగించి కొత్త స్తంభాల ఏర్పాటుకు, ఎం జె-4, డి-8 కాలువల ద్వారా పూర్తి ఆయకట్టుకు నీరు వదిలేటట్లు సహకరించాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.

