సాక్షర భారత్ లో పనిచేసిన మాకు అవకాశం ఇవ్వాలి.
నాటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు.నేటి ప్రభుత్వం ఏం చేస్తుందో…?
ఉద్యోగ అవకాశం కల్పించి వేలాది కుటుంబాల ఆదుకోవాలి.
ప్రజా పాలనలో మాకు న్యాయం జరగాలి.
10 ఏళ్లు పని చేశాం పక్కన పెట్టారు.
నాటి ముఖ్యమంత్రి పక్కన పెట్టారు నేటి ముఖ్యమంత్రి ఆదుకోవాలి.
కొత్త ప్రోగ్రాం లో కోఆర్డినేటర్ లను నియమించాలి.
చేగొండ రవికుమార్ యాదవ్.
అగ్నిధారన్యూస్ (హైదరాబాద్) 1978 రూపుదిద్దుకున్న వయోజన విద్యాశాఖ నేటికీ 2024 వరకు అనేక అవాంతరాల మధ్య ఉన్న లేనట్లు, ఉనికి కోల్పోకుండా, రాష్ట్రవ్యాప్తంగా పదుల సంఖ్యలో ఉద్యోగులు పనిచేస్తూ వయోజన విద్యాశాఖ ఉనికిని కాపాడుతున్నారు. 15 సంవత్సరాల పైబడిన స్త్రీ,పురుషుల నిరక్షరాస్యతను దూరం చేసి అక్షరాస్యతకు దగ్గరచేసి చదవడం, రాయడం, సంఖ్యా పరిజ్ఞానం, నేర్పించడం గత 40 సంవత్సరాలుగా చేపడుతున్న సుదీర్ఘ యజ్ఞంగా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఈశాఖలో వందల సంఖ్యలో ఉన్న ఉద్యోగస్తులు పదవి విరమణలతో రానురాను పదుల సంఖ్యలో ఉద్యోగస్తులగా మారిన ఆ శాఖను పట్టించుకునే ప్రభుత్వాలే లేవు. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాసులుగా తీర్చిదిద్దడంలో వేలాదిమంది,నిరుద్యోగ యువకులు సమిదలుగా మారినారు. అక్షరాస్యత కార్యక్రమం ఒక యజ్ఞంగా భావించిన ఉన్నత విద్యావంతులేoదరో వయోజన విద్యశాఖలో కాంట్రాక్టు పద్ధతి పైన పనిచేసి చేసి తమ విలువైన కాలాన్ని కేటాయించి ఉద్యోగ భద్రత లేక దిక్కులేని స్థితికి నెట్టు వేయబడ్డారు. ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన ఫలితం శూన్యం. వివరాల్లోకి వెళితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించే, కార్యక్రమం వయోజన విద్య, ఈ కార్యక్రమానికి యునెస్కో ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు 75 శాతం 25 శాతం నిధుల ఖర్చుతో ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా తీసుకొని నిర్ణయాల మేరకు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేది . ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అక్షరఉజ్వల, నిరంతర విద్య, సాక్షర భారత్ పేర్లతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తుంటాయి. గత 20 సంవత్సరాలుగా వయోజన విద్యాశాఖ స్వరూపాన్ని చూసినట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పరిశీలించినట్లయితే ఈ విధంగా ఉంది 1996లో నిరంతర విద్యా కార్యక్రమం పేరుతో వయోజన విద్య కార్యక్రమాలు నిర్వహించేవారు. గ్రామస్థాయిలో పనిచేసే ప్రేరక్ కు 500అసిస్టెంట్ ప్రేరక్ కు 300 నోడల్ ప్రేరక్ కు 1200 గౌరవ వేతనం ఇచ్చేవారు. అనంతరం 2009లో సాక్షర భారత్ కార్యక్రమం పేరుతో గ్రామస్థాయిలో ఇద్దరు గ్రామ కోఆర్డినేటర్లను ఒక్కొక్కరికి 2000 వేతనంతో నియమించారు. ఒక మండల కోఆర్డినేటర్ కు నెలకు 6000 వేతనంతో మండల కోఆర్డినేటర్ గా నియమించారు. సాక్షర భారత్ కార్యక్రమం ద్వారా ఎంపిక కాబడ్డ కోఆర్డినేటర్లు దాదాపు10 సంవత్సరాలుగా సేవలందించారు. ఉన్నత విద్యావంతులైన కోఆర్డినేటర్లు కోటి ఆశలతో కాంగ్రెస్ ప్రభుత్వంలో కొలువుదీరారు. తెలంగాణ ఏర్పడ్డాక ఉద్యోగాలు భద్రంగా ఉంటాయని, మా బతుకులు మారతాయని ఎంతగానో ఆశపడ్డారు. అది జరగకపోను 2018 మార్చ్ లో కేంద్ర ప్రభుత్వం సాక్షర భారత్ కార్యక్రమాన్ని రద్దు చేయడంతో, రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయని చెప్పుకోవచ్చు, ఎంతగానో మనోవేదన చెందారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులను ప్రజా ప్రతినిధులను కోఆర్డినేటర్లు వేడుకున్నారు.
కనుకరించనీ సర్కార్, సాక్షర భారత్ కార్యక్రమాన్ని కనుమరుగు చేసింది. సాక్షర భారత్ కోఆర్డినేటర్ల కుటుంబాల్లో కన్నీళ్లు నింపాయి. నేటి బిజెపి కేంద్ర ప్రభుత్వం, నాటి టిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వాలు.2018 మార్చితో కార్యక్రమాన్ని రద్దు చేసింది. ఇప్పటివరకు ఏఉద్యోగాలు రాక ఏం పని చేయలేక, మండల కోఆర్డినేటర్లు, గ్రామ కోఆర్డినేటర్లు, కూలీలుగా మారిన దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ఉన్నత విద్యావంతుల ఆశలపై నీళ్లు చల్లిన ఘనత ఈప్రభుత్వాలకే దక్కింది. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తమకు తమ కుటుంబాలకు న్యాయం చేయవని భావించిన కోఆర్డినేటర్లు. కాంగ్రెస్ పార్టీ హాయంలో సాక్షర భారత్ ఉద్యోగులుగా నియమించబడ్డ మేము మళ్లీ అదే పార్టీ అధికారంలోకి వస్తే తమకు ఉద్యోగాలు తమకు వస్తాయని ఆశతో … అప్పటి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు,నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, రాహుల్ గాంధీని, ఆసంఘ నాయకులు కలిశారు. 2018 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పొందుపరిచారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మా ఉద్యోగాలకు ఎలాంటి డోకా లేదు మావి మాకు వస్తాయనుకుంటున్న సమయంలో, మళ్లీ కేంద్ర ప్రభుత్వం ఆదేశంతో రాష్ట్రంలో న్యూ ఇండియా లిట్రసి ప్రోగ్రాం (ఎన్ ఐ ఎల్ పి) కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. 60 శాతం 40 శాతం నిధులతో నడిపించే కార్యక్రమానికి రాష్ట్రంలో అంకురార్పణ జరగనుంది. ఈ కార్యక్రమం కోసం,ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సాక్షర భారత్ కోఆర్డినేటర్లను, ఇప్పుడు చేపట్టబోయే కొత్త పథకంలో మళ్లీ కొనసాగించండి, అనే ప్రస్తావన ఎక్కడా లేకపోవడం బాధాకరం. ఈ కార్యక్రమం మొత్తం వాలంటరీ బేస్ తోనే నడిపించాలనే యోచనలో ప్రభుత్వాలు ఉన్నాయి. ఆదిశగా సంబంధిత వయోజన విద్యశాఖ చక చక అడుగులు వేస్తుంది. 2023 …2024 సంవత్సరానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్లు కూడా రూపకల్పనకు చర్యలు చేపట్టాల్సిందిగా , రాష్ట్రంలోని ఆయా జిల్లాల కలెక్టర్ లకు, తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రెటరీ, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ 04/01/2024న సర్కులర్ ను జారీ చేశారు. 19/2/2024 సోమవారం రోజు ఆయాజిల్లాల కలెక్టర్ లకు, జిల్లా విద్యాధికారులకు, జిల్లా వయోజన విద్యాశాఖ అధికారుల ద్వారా అందినట్టు సమాచారం. అందిన ఆదేశాలలో జిల్లాస్థాయిలో త్వరలో కన్వర్జేన్స్ మీటింగ్ పెట్టాలని ఆ సమావేశానికి, జిల్లావిద్యాశాఖ అధికారి, జిల్లావయోజనవిద్యాశాఖ అధికారి, జిల్లా పరిషత్ సీఈవో, జిల్లాపంచాయతీ అధికారి, డిస్టిక్ రూరల్ డెవలప్మెంట్ అధికారి, డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ తో, సమావేశం ఏర్పాటు చేస్తారు.
