అధికారులకు సమాచారమిచ్చిన వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్.
అగ్నిధారన్యూస్ వనపర్తి జిల్లా :
వనపర్తి జిల్లా కేంద్రంలోని 33 వ వార్డు వల్లబ్ నగర్ లో అకస్మాత్తుగా ఐరన్ విద్యుత్ స్తంభం ఒరిగింది. విషయం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, మాజీ కౌన్సిలర్ ఉంగ్లం తిరుమల్, గులాం ఖాదర్ సందర్శించి విద్యుత్ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించి ఐరన్ పోల్ ను తొలగించి దాని స్థానంలో నూతన స్తంభాన్ని ఏర్పాటు చేశారు. వార్డు ప్రజలకు విద్యుత్ అంతరాయం, ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అలాగే పట్టణంలోని వివిధ వార్డులలో మిగిలిపోయిన ఐరన్ పోల్స్ లను గుర్తించి వెంటనే సిమెంట్ పోల్స్ ని ఏర్పాటు చేసి వనపర్తి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, ప్రమాదాలు తలెత్తకుండా చూడాలని విద్యుత్ అధికారులకు మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ సూచించారు.
