అక్కడికక్కడే అయిదుగురు మృతి

మృతుల్లో ముగ్గురు చిన్నారులు

అగ్నిధారన్యూస్ వనపర్తి జిల్లా
వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ సమీపంలోని బైపాస్ జాతీయ రహదారిపై టేక్కలయ్య దర్గా సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.బళ్లారికి చెందిన కుటుంబం పెళ్లి కుదరడంతో ఎంగేజ్ మెంట్ కొరకు కుటుంబ సభ్యులు తో హైదరాబాదుకు వెళ్తుండగా కే ఏ 34 పి 7323 నెంబర్ గల ఎర్టిగా కారు అదుపుతప్పి చెట్టును బలంగా ఢీకొనగా నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. చిన్నారి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది.మరో ఆరుగురికి తీవ్ర గాయాలు కావడంతో క్షతగాత్రులను వనపర్తి ఏరియా ఆసుపత్రికి 108 వాహనంలో తరలించారు.వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలుకు తరలించారు.
కారులో మొత్తం 12 మంది ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.