రాష్ట్రవ్యాప్తంగా భారీగా అవినీతి.
విచారణ ఆదేశించిన ప్రభుత్వం.
దాదాపు 40000 దరఖాస్తులు పెండింగ్.
విచారణ అనంతరం లబ్ధిదారులకు న్యాయం.
విచారణలో చిక్కుకునేది ఎవరు….?
సర్కారు నిర్ణయంతో అక్రమార్కుల గుండెల్లో దడ.
అగ్నిధారన్యూస్ హైదరాబాద్// పెద్దపల్లి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శాసనసభ ఎన్నికలు ఉండడంతో పాటు ఎలక్షన్ కోడ్ అమలు కావడంతో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న వేలాది మందికి చెక్కుల పంపిణీ జరగలేదు. రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ నాటికి 30 వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు వాటి సంఖ్య 40 వేలకు చేరింది.శాసనసభ ఎన్నికలు జరిగి రెండు నెలలు అయినప్పటికీ సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులు ముందుకు కదలడం లేదు .
సిఎంఆర్ఎఫ్ దరఖాస్తుల మరిచిన కొందరు మాజీ ఎమ్మెల్యేలలు….
ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం రోగ పీడిత కుటుంబాలకు కొంతలో కొంత ఆర్థికoగా, మానసికంగా ధైర్యాన్ని ఇస్తుంది. అదే ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలకు డబ్బుతో ముడిపడిన సమస్య ఏదైనా పెద్దదే, మరి ముఖ్యంగా కుటుంబ సభ్యుల అనారోగ్యానికి సంబంధించినదైతే.. వారి వ్యధను చెప్పనవసరం లేదు. దీర్ఘకాలిక రోగాలే కావచ్చు, ఊహించకుండా వచ్చిపడే జబ్బులు కావచ్చు ఇంటిని,ఒంటిని గుల్ల చేసి పారేస్తాయి. చివరకు అప్పులపాలు చేస్తాయి. ఆరోగ్యాన్ని కుదురు పరచుకోవడానికి,ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు ఉన్నప్పటికీ కొన్ని జబ్బులను గత ప్రభుత్వం ఈ పథకంలో చేర్చలేదు. దీంతో చాలామంది పేద ప్రజలు అప్పులు కుప్పలైన అవస్థలు పడే వాళ్ళు ఉన్నారు. ఆరోగ్యం ముఖ్యం కాబట్టి అందినకాడికి అప్పు తెచ్చి, చాలామంది పేదవాళ్లు వైద్యం చేయిస్తారు. అలా అనారోగ్యంతో హాస్పిటల్ పాలైన దారిద్ర రేఖకు దిగువనున్నవారు, చికిత్స కోసం చేసిన అప్పులు భారం కావద్దని కుటుంబాల చేతికి పోవద్దని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి సహాయ నిధికోసం బాధితులు అప్పటి స్థానిక స్థానిక ఎమ్మెల్యేలు ఆశ్రయిస్తారు. కానీ వాటిని కొందరు మాజీ ఎమ్మెల్యేలు మరిచారు. అయితే సీఎంఆర్ఎఫ్ లో దరఖాస్తు చేసుకున్నవారికి వైద్యం కోసం ఖర్చైన దానిలో కొంత మాత్రమే వస్తుండడంతో, లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని పరిమితి శాతాన్ని మరింత పెంచితే బాగుంటుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గత సంవత్సరం అక్టోబర్ నెల నుండి జారీ చేయని సీఎంఆర్ఎఫ్ చెక్కులు.
సిఎంఆర్ఎఫ్ లో అక్రమాలు:
రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రోగ పీడితులకు వ్యాధిగ్రస్తులకు ఆర్థిక భారాన్ని తగ్గించడం కోసం తోడుబాటు అందించే పథకంలోనూ, కోట్లాది రూపాయల భారీ అక్రమాలు జరిగాయని రేవంత్ రెడ్డి ప్రభుత్వం విశ్వసిస్తుంది. విచారణకు ఆదేశించింది. విచారణ అనంతరం ముఖ్యమంత్రి సహాయనిధి లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరేలా చర్యలు చేపట్టాల కార్యచరణ సిద్ధం చేస్తుంది.
సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారుడు గరిగంటి అనిల్ సుద్దాల గ్రామం పెద్దపల్లి జిల్లా.
గత సంవత్సరం మా నాన్నకు కంటి చికిత్స గురించి వరంగల్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించాం. ఖర్చు 60 వేలకు పైగా అయింది. దీంతో మేము ముఖ్యమంత్రి సహాయ నిధి కింద దరఖాస్తు చేసుకున్నాము.


