హాస్పిటల్ కు తరలించిన మంత్రి జూపల్లి

అగ్నిధారన్యూస్ వనపర్తి జిల్లా :

ఆదివారం వనపర్తి జిల్లా వీపనగండ్ల మండల పర్యటనలో భాగంగా రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు హైద్రాబాద్ నుంచి కొల్లాపూర్ నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా జాతీయ రహదారిపై  రాయికల్ టోల్ గేట్ దగ్గర ఫిట్స్ వచ్చి ఒక వ్యక్తి కింద పడిపోవడంతో గమనించిన మంత్రి జూపల్లి  తన సహచరులతో  కలిసి బాధితుడిని కాపాడే ప్రయత్నం చేశారు.అనంతరం మంత్రి  అంబులెన్సు కు ఫోన్ చేసి హాస్పిటల్ కు పంపించి వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. జాతీయ రహదారిపై ఈ ఘటన ను గమనించిన ప్రయాణికులు పలువురు మంత్రిని ప్రశంసించారు.