అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్
సుల్తానాబాద్ మండల కేంద్రంలోని సుద్దాల గ్రామ గోదాముల వద్ద రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే నీరుకుళ్ళ గ్రామానికి చెందిన అడ్డగుంట మొండయ్య, గోదావరిఖని కి చెందిన కనుకయ్యలు కనుకుల గ్రామంలో సంవత్సరీకం కార్యక్రమం ముగించుకొని ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా సుద్దాల గ్రామ గోదాముల వద్ద గుర్తుతెలియని కారు ఢీకొనడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తమై సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం వారి కుటుంబ సభ్యులు కరీంనగర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సుల్తానాబాద్ ఎస్సై శ్రావణ్ కుమార్ తెలిపారు.
