జర్నలిస్ట్ లు భజనకారులుగా మారోద్దు…!
ప్రశ్నించేవారిని అణచివేస్తారా..?
ఏకగ్రీవ తీర్మానం ద్వారా పూర్తిస్థాయి కమిటీ ఏర్పాటు.
వనపర్తి జిల్లా ప్రేస్ క్లబ్ అధ్యక్షులు అంబటి.
అగ్నిధారన్యూస్ వనపర్తి జిల్లా:
మోసకారి మాటలు చెప్పే జర్నలిస్టు సంఘ నాయకులను నమ్మి మోసపోవద్దని వనపర్తి జిల్లా ప్రేస్ క్లబ్ అధ్యక్షులు అంబటి స్వామి అన్నారు. మంగళవారం వనపర్తి పట్టణంలోని యాదవ సంఘం భవనంలో వనపర్తి జిల్లా ప్రేస్ క్లబ్ కమిటీని ఏకగ్రీవంగా అనుకున్నారు. ఈ సందర్భంగా అంబటి స్వామి మాట్లాడుతూ… కొన్ని ఏళ్ళ తర్వాత వనపర్తి జిల్లా ప్రేస్ క్లబ్ కమిటీ ఏర్పాటు కావడం సంతోషదాయకమన్నారు. వనపర్తిలో ఉన్న కొన్ని జర్నలిస్టు సంఘాల నాయకులు ప్రెస్ క్లబ్ ను మరుగున పడేసారని విమర్శించారు. యూనియన్ల ముసుగులో బరితెగించి తోటి విలేకర్లకు తీరని అన్యాయం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టు సంఘాలకు అతీతంగా ప్రెస్ క్లబ్ కమిటీ ఏర్పడుతే తమ పెత్తనం, ఆదిత్యం కొల్పోవాల్సి వస్తుందని కుట్ర ధోరణితో వ్యవహరించారని వెల్లడించారు. యూనియన్ల నాయకులు జర్నలిస్టుల సమస్యల ను పట్టించుకోకుండా స్వంత ప్రయోజనాల కోసం ఏ పార్టీ అధికారంలో ఉంటే వారికి భజనలు చేయడం అలవాటుగా మార్చుకున్నారని ఎద్దేవా చేశారు. ఎవరైనా జర్నలిస్ట్ యూనియన్ నాయకుల ప్రశ్నిస్తే వారిపై కక్ష సాధింపు ధోరణితో ప్రవర్తించడం, అక్రిడిటేషన్ రాకుండా చేయడం, పత్రిక పరంగా ఇబ్బందులకు గురి చేయడం వారి నైజంగా మారిందన్నారు. ఇటీవల జర్నలిస్టుల ప్లాట్ల విషయంలో నిజమైన వర్కింగ్, జర్నలిస్టులకు అన్యాయం తీవ్ర స్థాయిలో విమర్శించారు. అర్హత లేనివారి కి ప్లాట్లను ధారాదత్తం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా యూనియన్ల నాయకులు బద్ద శత్రువులుగా ఉన్నవారు జర్నలిస్టుల ప్లాట్ల పంపిణీ విషయంలో అందరు ఒక్కటై అర్హులైన జర్నలిస్టులకు ప్లాట్లు రాకుండా చేశారన్నారు. జర్నలిస్టు సంఘాల నాయకులు కొందరు ఏకమై హైదరాబాద్ లో ఒక ఖరీదైన హోటల్ ల్లో రూం అద్దెకు తీసుకుని జర్నలిస్టుల ప్లాట్ల స్థలాల సర్టిఫికెట్లు పంచుకుని ఇతరులకు అమ్మే సే ప్రయత్నం చేశారని దుయ్యబడ్డారు.అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు రావడం అధికార పార్టీ మారిపోవడంతో వీరి బండారం ఒక్కొక్కటి ఇప్పుడు వెలుగు చూస్తున్నాయని విమర్శించారు. ఇంత కాలం సంఘాల నాయకుల అరాచకాలను భరించిన జర్నలిస్టులు అందరు ఒక్కతాటిపైకి వచ్చి ప్రెస్ క్లబ్ కమిటీ వేసుకోవడం జరిగిందన్నారు. ఇప్పటికి కొంత మంది జర్నలిస్టులను తమ అదుపాజ్ఞాలో ఉంచుకునే ప్రయత్నంలో యూనియన్ నాయకులు శత విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని ఉన్నారు. అవకాశవాద,అవినీతి పరులైన యూనియన్ నాయకుల మాటలు నమ్మవద్దన్నారు. యూనియన్ నాయకులు తమ ఉనికి కోల్పోతుందనే భయంతో ఇప్పటికి కొంత మంది జర్నలిస్టులను తప్పు తోవ పట్టిస్తున్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా వర్కింగ్ జర్నలిస్టులు అవకాశ వాదా యూనియన్ నాయకుల మాటలు నమ్మవద్దని అన్నారు. ఇప్పటినుండి నూతన కమిటీ,ఒక ప్రణాళిక బద్దంగా జర్నలిస్టుల సమస్యలను కలసి కట్టుగా పరిష్కరించుకోవడం కోసం కలసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో
వనపర్తి ప్రెస్ క్లబ్ కమిటీ
అధ్యక్షుడు అంబటి స్వామి, ప్రధాన కార్యదర్శి పి పవన్ కుమార్,కోశాధికారి గంగవరం రామకృష్ణారెడ్డి,ఉపాధ్యక్షులు రవి శంకర్ గౌడ్,రవి ప్రసాద్, సంతోష్, కుమార్ యాదవ్, కే హుస్సేన్, ఆంజనేయులు యాదవ్, కార్యదర్శిలుగా,కడమంచి శేఖర్,సాయిరాం, నాకొండ యాదవ్,అశోక్ గౌడ్, సహాయ కార్యదర్శులు,ప్రవీణ్ కుమార్, ఎం ఏ. అలీమ్, కే గోపాల్ సలహాదారులు లింగన్ గౌడ్, దశరథం, పూరి సురేష్,భక్త రాజు,ప్రచార కార్యదర్శిలుగా,డి శ్రీనాథ్,ముంత రవి,గుజ్జుల స్వామి కమిటీ సభ్యులు,జి రవి,నరసింహ రాజు,ఏ బాలరాజు, కృష్ణయ్య,లక్ష్మీనారాయణ,ఎండి ఖలీల్,వేణుగోపాల్, మనోహర్,జి బిసన్న,సోషల్ మీడియా,ఎం అరుణ్ కుమార్, విష్ణు, టి మహేష్ లను వనపర్తి ప్రెస్ క్లబ్ కమిటీ ఎన్నుకొన్నారు.

