వివరాలు వెల్లడించిన పెద్దపల్లి ఏసీపి కృష్ణ.

మద్యానికి బానిసైన భర్త.

పంచాయతీ పెట్టిన తీరు మారని పున్నంరెడ్డి.

తాగొద్దు అన్నoదుకే హత్య.

మృతురాలి తల్లి వజ్రవ్వ ఫిర్యాదు.

 24 గంటల లోపే నిందితుడిని రిమాండ్ కు పంపిన పోలీసులు.

 

అగ్నిధారన్యూస్, పెద్దపల్లి క్రైమ్:  బుధవారం రోజు పెద్దపల్లి సీఐ కృష్ణ తన కార్యాలయంలో,ఏర్పాటు చేసిన  విలేకరుల సమావేశంలో పెద్దపల్లి ఏసీపీ కృష్ణ పాల్గొని, మంగళవారం రోజు జగిత్యాల జిల్లా, ఎండపల్లి మండలం, మారేడుపల్లి గ్రామంలో,జరిగిన హత్య సంఘటన వివరాలను వెల్లడించారు. వివరాలలోకి వెళ్తే, జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని, మారేడుపల్లి గ్రామంలో, నివాసముంటున్న వ్యాళ్ళ పున్నoరెడ్డి, వయసు 46, వ్యాళ్ళ రజిత,వయసు 33, దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడుపుతుండేవారు, వారి మధ్య  తరచుగా గొడవలు  అవుతుండేవి అన్నారు,  భర్త వ్యాళ్ళ పున్నoరెడ్డి మద్యానికి బానిసై జల్సాలకు, విలాసాలకు, అలవాటుపడి, ప్రతిరోజు మద్యంతాగి వచ్చి భార్యా,బిడ్డలతో గొడవపడేవాడు, పలుమార్లు, పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టించిన తీరు మారలేదు,ఈక్రమంలో గత నెల ఫిబ్రవరి నెలలో నిందితుడు అయోధ్య రామమందిరానికి వెళ్లి వచ్చినాడు అన్నారు.అప్పటినుండి తాగుడు మానివేశాడు అని తెలిపారు. ఈ క్రమంలో,తేదీ 26.03.2024 రోజు మంగళవారం  యధావిధిగా మద్యం తాగి రావడంతో మృతురాలు రజిత, మళ్లీ మద్యం ఎందుకు తాగుతున్నావు అంటూ ప్రశ్నించగా…మధ్యమత్తులో ఉన్న నిందితుడు ఆమెతో గొడవ పడి,  తన భార్య బ్రతికిఉంటే  అడ్డంకిగా ఉంటుందని భావించి, హత్య చేయాలని నిర్ణయించుకొని  26.3.2024 మంగళవారం రోజు రాత్రి అందాద 11:00 సమయంలో తన ఇంట్లో ఉన్న చైనాపాన (ఇనుము) తో మృతురాలి తలపై కొట్టగా, తీవ్ర గాయాలు,రక్తస్రావంతో రజిత,అక్కడికక్కడే మరణించిందని తెలిపారు. మృతురాలి తల్లి, తీపిరెడ్డి వజ్రవ్వ, గ్రామం, నర్సింగాపూర్, ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు,పెద్దపల్లి సిఐ కృష్ణ, ఎండపల్లి ఎస్ ఐ స్వామి, ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టామన్నారు. నమ్మదగిన సమాచారం మేరకు నిందితున్ని ధర్మారం ఎక్స్ రోడ్ వద్ద అదుపులోకి తీసుకున్నామన్నారు. అతని వద్ద నుండి మృతురాలిని చంపడానికి ఉపయోగించిన చైనాపానా, మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకుని నిందితున్ని,బుధవారం  రిమాండ్ కు తరలించామని వివరాలు వెల్లడించారు. సంఘటన జరిగి 24 గంటలు గడవకముందే, నిందితున్ని చాకచక్యంగా పట్టుకున్న పెద్దపల్లిసీఐ కృష్ణ, ఎస్ ఐ స్వామి,వారి సిబ్బందిని ఏ సి పి, జి.కృష్ణ విలేకరుల సమక్షంలో ప్రత్యేకంగా అభినందించారు.