అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి :

ప్రభుత్వం మధ్యాహ్న భోజన వర్కర్ల పట్ల ద్వంద వైఖరిని విడనాడాలి తాడూరి శ్రీమాన్ భూత గడ్డ సంపత్.

మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని పెద్దపెల్లి జిల్లా బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు తాడూరి శ్రీమన్నారాయణ ఆరోపించారు. మంగళవారం పెద్దపెల్లి జిల్లా అమరవీరుల స్తూపం వద్ద సమస్యల పరిష్కారానికి గత ఆరు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల దీక్షా శిబిరాన్ని పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు భూత గడ్డ సంపత్ తూముల సుభాష్ లతో కలిసి సందర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ పేరుతో అధికారంలోకి వచ్చి ఆకలి చావుల తెలంగాణ మార్చాడని శ్రీమన్నారాయణ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ద్వంద వైఖరి విడనాడాలి అన్నారు వెయ్యి రూపాయల గౌరవ వేతనం తోని మధ్యాహ్న భోజన కార్మికులు పని చేయడం దురదృష్టకరమని అన్నారు. ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా వేయి రూపాయల వేతనం ఇచ్చి పని చేయించుకోవడం లేదని అని అన్నారు. ధనిక తెలంగాణలో దరిద్రపు బతుకులు బతుకుతున్న మహిళా కార్మికుల వెతలు ముఖ్యమంత్రి దృష్టిలో లేకపోవడం సాధించిన తెలంగాణ దౌర్భాగ్యం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లో మధ్యాహ్న భోజన సమస్యల వర్కర్ల సమస్య పరిష్కారం అయ్యే అంతవరకు తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల వలె మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని శ్రీమన్నారాయణ డిమాండ్ చేశారు పెరిగిన వస్తుసేవల ధరలను దృష్టిలో ఉంచుకొని ప్రతి విద్యార్థికి పదిహేను రూపాయల చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా మధ్యాహ్న భోజన వర్కర్ల సమస్యను రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకెళ్ళి ఈ ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి అందరి సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు మీ వెంట ఉంటామన్నారు