పదవ తరగతి సాంఘిక శాస్త్రం పరీక్షకు,7,716 మంది హాజరు.

సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.

… పెద్దపల్లి డి.ఈ.ఓ.- డి.మాధవి.

అగ్నిధారన్యూస్,పెద్దపల్లి, మార్చి -30:

10వ తరగతి సాంఘిక శాస్త్రం పరీక్షకు 7,716 మంది విద్యార్థులు హాజరయ్యారని జిల్లా విద్యా శాఖ అధికారి డి.మాధవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లాలో శనివారం నిర్వహించిన పదవ తరగతి సాంఘిక శాస్త్రం పరీక్షలో 7,728 మంది విద్యార్థులకు గాను 7,716 మంది విద్యార్థులు హాజరు కాగా, 99.8 శాతం హాజరు నమోదు అయినట్లు తెలిపారు. మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 15 పరీక్షా కేంద్రాలు, అసిస్టెంట్ కమీషనర్ పరీక్షల విభాగం మూడు పరీక్షా కేంద్రాలను, డిఈఓ. మూడు పరీక్షా కేంద్రాలను సందర్శించారనీ, మాల్ ప్రాక్టీస్ కేసులు బుక్ కాలేదని, సాంఘిక శాస్త్రం పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు, పదవ తరగతి పరీక్షలు సజావుగా నిర్వహించడంలో సహకరించిన అన్ని శాఖల అధికారులకు, మీడియా ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు డి.ఈ.ఓ. మాధవి ఆ ప్రకటనలో తెలిపారు.